EPAPER

How To Remove Pigmentation on Face: మంగు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి

How To Remove Pigmentation on Face: మంగు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి

Mangu Machalu


How To Remove Pigmentation on Face: కొంతమంది ఎంతో ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తారు. కానీ ముఖం దగ్గరికి వచ్చే సరికి నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మచ్చలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మంగు మచ్చలు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుంచి ముక్కు వరకు వ్యాపిస్తాయి. కొంతమందిలో ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు భాగంలో కూడా ఏర్పడే అవకాశం ఉంది. శరీర వర్ణానికి కారణమయ్యే మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల హైపర్ పెగ్మెంటేషన్ కు దారి తీస్తుంది. మెలనిన్ ఒకేచోట పేరుకుపోవడం వల్ల మంగు మచ్చలు వస్తాయి.

ఇదేమి వ్యాధి కాదు కాని మచ్చలు ఉన్నవారు ఆత్మనూన్యతతో పది మందిలోకి వెళ్లడానికి ఇబ్బంది పెడతారు. శరీరత్వాన్ని బట్టి ముఖంపై ముడతలు , పులిపిర్లు,పెద్ద పరిమాణంలో ఉండే పుట్టుమచ్చలు, వయసుతో పాటు మార్పులు, ఎండలో తిరగడం వల్ల మచ్చలు మొదలైనవి వస్తుంటాయి. వీటిలో కొన్నివంశపారంపర్యంగా వస్తే, మరికొన్ని హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల కూడా రావచ్చు. వంసపారపర్యంగా వచ్చే మచ్చలను నివారించలేకపోయినా కొన్ని చిట్కాలతో వాటి ప్రభావాన్నితగ్గించవచ్చు. తొలి దశలో ఉన్న అనేక మచ్చలను చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకోవచ్చు.


Also Read: పచ్చి మామిడికాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

పావు టీ స్పూన్ నిమ్మరసానికి సమంగా తేనె కలపి మచ్చలపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

టీ స్పూన్ టమాటో రసం, టీ స్పూన్ గంధం పొడి, రెండు టేబుల్ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయాలి.

తాజా వెన్నను ముకంపై ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే క్రమేణా పలుచబడి కొంతకాలానికి చర్మం రంగులో కలిసిపోతాయి.

అలోవెరా పేస్టును మచ్చలపై పూయడం వల్ల కూడా మంగు మచ్చలు తగ్గుతాయి.

బంగాళదుంప రసం తీయాలి. దానిలో దూది ముంచి మచ్చలపై అద్దాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి.

జాజికాయ పాలలో అరగదీసి రాయడం వల్ల కూడా మచ్చలు తగ్గుతాయి.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×