EPAPER

Top Hamas Commander Killed : టాప్ హమాస్ కమాండర్ హతం.. ప్రకటించిన అమెరికా

Top Hamas Commander Killed : టాప్ హమాస్ కమాండర్ హతం.. ప్రకటించిన అమెరికా


Top Hamas Commander Issa Killed in Airstrike : గత వారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) జరిపిన వైమానిక దాడిలో హమాస్ అగ్రనేత మార్వాన్ ఇస్సా మరణించినట్లు యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు (NSA) జేక్ సుల్లివన్ సోమవారం ధృవీకరించారు.

“గతవారం ఇజ్రాయెల్ ఆపరేషన్‌లో హమాస్ నంబర్ త్రీ మార్వాన్ ఇస్సా మరణించాడు” అని వార్తా సంస్థ AFP NSA జేక్ సుల్లివన్‌ను ఉటంకిస్తూ ఈ విషయాన్ని పేర్కొంది.


“మిగిలిన అగ్రనేతలు అజ్ఞాతంలో ఉన్నారు. బహుశా హమాస్ టన్నెల్ నెట్‌వర్క్‌లో లోతుగా ఉన్నారు. వారికి కూడా న్యాయం జరుగుతుంది.” అని ఆయన చెప్పారు. కాగా.. హమాస్ అగ్ర కమాండర్ ఇస్సాను ఇజ్రాయెల్ హతమార్చినట్లు హమాస్ మాత్రం ఇంకా ధృవీకరించలేదు.

Also Read : ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌లో యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు

అంతకుముందు మార్చి 11న, IDF మార్చి 9-10 తేదీలలో సెంట్రల్ గాజాలోని భూగర్భ సమ్మేళనంపై వైమానిక దాడి ఇస్సాను లక్ష్యంగా చేసుకుంది. అక్కడ జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ లో మరణించింది ఇస్సానా కాదా అన్నది తెలియాల్సి ఉందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడికి ప్రణాళిక వేసిన వారిలో ఇస్సా ఒకరిగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ మరణించింది ఇస్సానా కాదా అని నిర్థారణ కాకుండానే.. అమెరికా ఇస్సా మరణించినట్లు ప్రకటించడం గమనార్హం.

ఇదిలా ఉండగా, సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడి గాజాలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. వారి సంభాషణలో, బైడెన్ రఫాలో ఉన్న శరణార్థులకు సహాయం అందించే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

 

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×