EPAPER

Brown Snake in Cupboard: చెడ్డీల పెట్టెలో పాము.. చూసి గుండె ఆగినంత పనైంది!

Brown Snake in Cupboard: చెడ్డీల పెట్టెలో పాము.. చూసి గుండె ఆగినంత పనైంది!
Brown Snake
Brown Snake

Snake Finds in Cupboards: పాము.. ఆ పేరు వినగానే మనలో చాలామంది చెడ్డీలు తడిచిపోతాయి. భయంతో చచ్చిపోతాము. ఆ పేరు తలుచుకుంటేనే వణికిపోతారు. సరదాగా దారిలో అలా పోతున్న పొరపాటున చిన్న అలజడి వినిపించిన పామనుకొని ఆ దరిదాపుల్లో కూడా ఉండరు. అయితే ఈ పాములు ఎక్కువగా అడవులు,పొదలు, కొండ ప్రాంతాలు, పంట పొలాల్లో తదితర ప్రాంతాల్లో కనిపిస్తాయి. వర్షకాలంలో పాములు ఎక్కువగా బయటకు సంచరిస్తుంటాయి.


ఈ కాలంలో వేటాడి వాటికి కావాలసిన ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఇళ్లల్లోకి కూడా ప్రవేశిస్తాయి. అవి ఎలుకలను వేటాడేందుకు ఇళ్లలోకి చొరబడతాయి. ఇంట్లోని బీరువాలు, బస్తాలు, మూలల్లో నక్కుతాయి. అటుగా వెళ్లినప్పుడు మనల్ని కాటేస్తాయి. తాజాగా ఇటువంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేయండి.

ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. అసలు మ్యాటర్‌కి వస్తే ఒక మహిళ తన కుమార్తెల గదిలోకి వెళ్లింది. పక్కనే ఉన్న తమ కుమార్తెల బట్టలు అశుభ్రంగా ఉండటం గమనించింది. ర్యాక్ ‌నుంచి బట్టలు తీసి వాషింగ్ మెషిన్‌లో వేయాలని భావించింది. ఇందుకు గాను బట్టలు తీసేందుకు ప్రయత్నించింది. ఇంతలో షాకింగ్ సీన్ కనిపించింది. చేతికి మెత్తగా ఏదో తాకింది.


Also Read: ప్లెయిన్​ దోశ ఆర్డర్​ చేస్తే.. బొద్దింకల దోశ ఇచ్చారు!

అది ఏంటా అని చూసి పాము ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా ఆశ్యర్యపోయింది. వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగులు తీసి రూమ్‌డోర్స్ లాక్ చేసింది. ఇంట్లో వాళ్లను జరిగిన ఘటన గురించి వివరించింది. దీంతో వారు అలర్ట్ అయి స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ అయిన మార్క్ ఘటనా స్థలికి చేరుకొని గదిలో ఉన్న ర్యాక్‌ను పరిశీలించాడు.

పామును పరిశీలించిన స్నేక్ క్యాచర్.. అది ప్రపంచంలోనే రెండో అత్యంత విషపూరిత బ్రౌన్ స్నేక్‌‌గా గుర్తించాడు. అతను గంటల తరబడి కష్టపడి ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఇది కాటు వేస్తే సెకన్ల వ్యవధిలోనే ప్రాణాలు పోతాయని తెలియజేశాడు. మెల్లగా బ్రౌన్ స్నేక్‌‌ను బంధించాడు. ఈ ఘటనను సదరు మహిళ ఎక్స్‌లో షేర్ చేసింది.

Also Read: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు..!

ఆస్ట్రేలియన్ వెనమ్ రీసెర్చ్ యూనిట్ డేటా ప్రకారం.. గోధుమ పాములు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పాములలో రెండవ అత్యంత విషపూరితమైనవి. ఇవిశక్తివంతమైన న్యూరోటాక్సిన్‌ను కలిగి ఉంటాయి. ఈ పాము కాటు వేసిన వెంటనే గుండె, ఊపిరితిత్తులు, డయాఫ్రాగమ్‌లోని నరాలపై ప్రభావం చూపుతోంది. ఈ గోధుమ రంగు జాతి సర్పాలు ఆస్ట్రేలియా యొక్క తూర్పు భాగంలో సాధారణంగా కనిపిస్తాయి.

Tags

Related News

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Big Stories

×