EPAPER

Smriti Mandhana – Meg Lanning: ఇది సమష్టి విజయం.. అందుకే ఓడిపోయాం.. కెప్టెన్స్ కామెంట్స్!

Smriti Mandhana – Meg Lanning: ఇది సమష్టి విజయం.. అందుకే ఓడిపోయాం.. కెప్టెన్స్ కామెంట్స్!

smruthi mandhana latest news


WPL final match 2024: ఉమెన్ ఐపీఎల్ 2024 సీజన్ ట్రోఫీని ఆర్సీబీ గెలుచుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ స్మృతి మంథన మాట్లాడుతూ ఇది సమష్టి విజయమని పేర్కొంది. ఫీల్డింగ్ అద్భుతంగా ఉందని తెలిపింది. షెఫాలీ వర్మ క్యాచ్ ని లాంగ్ ఆన్ లో జార్జియా అద్భుతంగా పట్టిందని తెలిపింది. అక్కడే బ్రేక్ వచ్చిందని తెలిపింది. ఇంక అదే ఓవర్ లో వరుసగా మరో రెండు వికెట్లు పడేసరికి డిల్లీ ఒత్తిడిలోకి వెళ్లిందని తెలిపింది.

ఓ విషయం కచ్చితంగా చెప్పగలను. మా టీమ్ పట్ల గర్వపడుతున్నానని తెలిపింది. మేం ఢిల్లీకి వచ్చినప్పుడు రెండు మ్యాచ్ లు ఓడిపోయాం. ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపింది. మేనేజ్మెంట్ ఎళ్లవేళలా మాకు మద్దతుగా నిలిచింది. గ్రౌండులోకి వెళ్లాక, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోమని చెప్పింది.


ట్రోఫీని నేను ఒక్కదాన్నిగెలవలేదు. జట్టులో 15మంది ఉన్నాం. మా వెనుక కోచ్ లు, స్టాఫ్ ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇది అందరి గెలుపు అని తెలిపింది. ఎప్పుడూ ఈ సారి కప్ మనదేనని కన్నడలో అంటుంటారు. ఇప్పటి నుంచి ‘ఈ సాలా కప్ నమ్దూ’ ఈ సారి కప్ మనది అనండి.’ అని స్మృతి మంధాన అభిమానులకు తెలిపింది.

Also Read: మ్యాచ్ విన్నర్ శ్రేయాంక పాటిల్ ఎవరు?

అందుకే ఫైనల్ లో ఓటమి: ఢిల్లీ కెప్టెన్

ఫైనల్ లో ఓటమి అనంతరం ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ మాట్లాడింది. టేబుల్ టాపర్ గా ఉండి ఫైనల్ కి వచ్చిన మేం, సరిగ్గా ఆడాల్సిన మ్యాచ్ లో ఆడలేకపోయామని తెలిపింది. విజేతగా నిలిచిన ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపింది. ట్రోఫీ చేజారినందుకు ఎంతో బాధగా ఉంది.

ఆర్సీబీలో ఇద్దరు బౌలర్లు సోఫీ మోనన్, శ్రేయాంక పాటిల్ మా అద్రష్టాన్ని తారుమారు చేశారని తెలిపింది. వారిద్దరి వల్లే ఓటమి పాలయ్యామని తెలిపింది. వారి బౌలింగ్ ని అంచనా వేయడంలో పొరపాటు పడ్డామని తెలిపింది.

విజయం కోసం మేం ఎంతో ప్రయత్నించాం. కానీ  ఆశించిన ఫలితం రాలేదు. ఇంతవరకు రావడం వెనుక ఎంతోమంది కృషి దాగి ఉంది. మా సపోర్ట్ స్టాఫ్‌కు ధన్యవాదాలు. అయితే క్రికెట్ ఒక ఫన్నీ గేమ్.. కొన్నిసార్లు గెలుస్తారు, కొన్నిసార్లు ఓడిపోతారు” అని మెగ్ లానింగ్ వేదాంతిలా చెప్పింది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×