EPAPER

APPSC Group – 1 Mains Cancelled: గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై హైకోర్టులో అప్పీల్.. అత్యవసర విచారణకు ఆమోదం!

APPSC Group – 1 Mains Cancelled: గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై హైకోర్టులో అప్పీల్.. అత్యవసర విచారణకు ఆమోదం!
AP High Court on group 1 exam
AP High Court

Appeal in AP High Count on APPSC Group 1 Mains Cancel(AP updates): 2018 గ్రూప్‌-1 మెయిన్స్ రద్దును సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అప్పీల్‌ చేశాయి. ఇటీవలే సింగిల్ జడ్జి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చాయి. అయితే ఈ అప్పీల్ ను స్వీకరించిన హైకోర్టు అత్యవసర విచారణ కింద దీన్ని విచారించనున్నట్లు తెలిపింది. ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చేసిన అప్పీల్ పై మంగళవారం విచారణ జరుపుతామని ఏపీ ధర్మాసనం స్పష్టం చేసింది.


2018 నాటి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (27/2018)ను ఏపీ హైకోర్టు ఇటీవలే రద్దు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో జవాబుపత్రాల మూల్యాంకనం సరిగ్గా జరగలేదని తేల్చిచెప్పింది. రెండోసారి, మూడోసారి ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూల్యాంకనంలో కూడా అవకతవకలు ఉన్నట్లు ధర్మాసనం గుర్తించింది. ఈ రెండూ పేపర్ల మూల్యాంకనంలో సరైన పద్దతులు అనుసరించిన చట్టవిరుద్దమని చెప్తూ.. 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాను రద్దు చేసింది. తాజాగా నిబంధనలకు అనుగుణంగా ప్రధాన పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ నిర్వహించింది. అయితే జవాబు పత్రాల ముల్యాంకనం మాన్యువల్ పద్దతిలో రెండు సార్లు చేసి తమకి కావాల్సిన వారిని ప్రభుత్వం ఎంపిక చేసుకుని ఫలితాలు ప్రకటించిందంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం మెయిన్స్ పేపర్లను పలుమార్లు మూల్యాంకనం చట్టవిరుద్ధమని ఏపీపీఎస్సీ విడుదల చేసిన జాబితాను రద్దు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేశారు. అయితే ఈ అప్పీల్ ను హైకోర్టు అత్యవసర విచారణ కింద మంగళవారం విచారించనున్నట్లు వెల్లడించింది.


Also Read: YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ..!

167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2018లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే హైకోర్టు ప్రభుత్వం విడుదల చేసిన మెయిన్స్ జాబితాను రద్దు చేసింది. దీంతో అప్పట్లో ఉద్యోగాలు పొందినవారు ఒక్కసారిగా ఆందోళ చెందారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది. ఉద్యోగుల ప్రయోజనాల కోసం తాము సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని గతంలోనే స్పష్టం చేసింది.

Tags

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×