EPAPER

RCB Lift the WPL 2024 Cup: కప్ ఎగరేసుకుపోయిన బెంగళూరు.. ఉమెన్స్ ఐపీఎల్ విజేత ఆర్సీబీ

RCB Lift the WPL 2024 Cup: కప్ ఎగరేసుకుపోయిన బెంగళూరు.. ఉమెన్స్ ఐపీఎల్ విజేత ఆర్సీబీ
RCBW vs DCW WPL Final
RCBW vs DCW WPL Final

RCBW Won the WPL 2024 cup: ఉమెన్స్ ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆవిర్భవించింది. 114 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ .. ఓవర్లలో ఛేదించి కప్ ఎగరేసుకపోయింది. రీచా ఘోష్ ఫోర్ కొట్టి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చింది. ఎలీస్ పెర్రీ(35*, 37 బంతుల్లో, 4X4) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించింది.


ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు షెఫాలీ వర్మ (44, 27 బంతుల్లో; 2X4, 3X6), కెప్టెన్ మెగ్ లానింగ్(23, 23 బంతుల్లో; 3X4) అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. 7.1 ఓవర్లలో 64 పరుగులు చేసింది. మోలీనెక్స్ బౌలింగ్‌లో షెఫాలీ వర్మ అవుట్ అయ్యింది. ఆ తర్వాత అదే ఓవర్లో ఇంకో రెండు వికెట్లు తీసుకుని ఢిల్లీ టాప్ ఆర్డర్‌ను కుప్ప కూల్చింది. ఆ తరువాత ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లు విలవిల లాడారు. మొత్తం ఏడుగురు ఢిల్లీ బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఆర్సీబీ బౌలర్లలో మోలీనెక్స్ 3, శ్రేయాంక పాటిల్ 4, ఆశా శోభనా 2 వికెట్లు తీసుకున్నారు.

ఛేదన ప్రారంభించిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు కెప్టెన్ స్మ్రితి మంధానా(31, 39 బంతుల్లో), సోఫీ డెవీన్(32 ; 27 బంతుల్లో 5X4, 1X6) 8.1 ఓవర్లలో 49 పరుగులు చేశారు. ఆ తర్వాత ఎలీస్ పెర్రీ, రీచా ఘోష్ లాంఛనాలు పూర్తి చేశారు.


Tags

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×