Election Commission Changes Counting Dates: అరుణాచల్ ప్రదేశ్, సిక్కీం రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీని మారుస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన జూన్ 4న కాకుండా జూన్ 2న కౌంటింగ్ చేపటనున్నట్లు ఈసీ ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.
ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కీం రాష్ట్రాల్లో శాసన సభల పదవీకాలం జూన్ 2తో ముగుస్తుంది.
Election Commission of India changes the counting schedule of Arunachal Pradesh and Sikkim from June 4 to June 2. pic.twitter.com/t53RwnCth5
— ANI (@ANI) March 17, 2024