EPAPER

New Vote Registration: ఓటు నమోదుకు మరో అవకాశం.. ఏప్రిల్ 15 వరకు గడువు

New Vote Registration: ఓటు నమోదుకు మరో అవకాశం.. ఏప్రిల్ 15 వరకు గడువు

New Voter Registration news


New Vote Registration: ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అదే సమయంలో దేశంలో ఓటర్ల సంఖ్యను సీఈసీ ప్రకటించారు. భారత్ లో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ అర్హత ఉన్నా ఓటు హక్కులేని వారికి మరో అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటించింది.

తొలుత ఓటర్ల జాబితాలో ఓటు ఉందో ? లేదో చూసుకోవాలి. ఓటు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలి. ఓటు మిస్సైన వారు, ఇప్పటి అర్హత ఉన్నా ఓటు రాని వారు ఓటు కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఈసీ సూచించింది.


ఓటు నమోదు కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతున్నారు. ఏటా జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నారు. వారు ముందుగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. నెలరోజుల ముందు వరకు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.

Also Read : ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే ఇక అంతే?

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 15 లోపు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పిస్తారు. వారికి ఈ ఎన్నికల్లోనే ఓటు వేసే అవకాశం దక్కుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునేవారు ఫారం-8 దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఆఫ్ లైన్ లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నియోజకవర్గ ఎలక్షన్ ఆఫీసర్ , సహాయ ఎన్నికల అధికారి, పోలింగ్ కేంద్ర అధికారికి నేరుగా కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఓటులో మార్పులు చేర్పులకు కూడా సీఈసీ అవకాశం కల్పించింది.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×