EPAPER

Donald Trump Comments: నేను అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుంది: ట్రంప్

Donald Trump Comments: నేను అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుంది: ట్రంప్

Donald Trump latest newsDonald Trump Comments(Live tv news telugu): అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనని అధ్యక్షుడిగా గెలిపించకపోతే రక్తపాతం మొదలవుతుందని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్‌తో పోటీకి డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం దేశంలో బైడెన్ అనుసరిస్తున్న విధానాలను విమర్శించారు.


వచ్చే నవంబర్ 5న అమెరికాలో జరగబోయే ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయనని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను తిరిగి అమెరికా అధ్యక్ష పీఠంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలయ్యే అవకాశం ఉందని ఒహైయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తాను గెలవకపోతే.. బహుశా అమెరికాలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అనుసరిస్తున్న విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. మెక్సికోలో చైనా ప్రభుత్వం కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలనుంటుందని అది సరికాదని విమర్శించారు. తాను అధికారంలోకి రాగానే అక్కడ ఉత్పత్తి అయ్యే కార్లను దేశంలో విక్రయించడానికి అనుమతులు రద్దు చేస్తానని, వాటిపై 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తాని తెలిపారు. ప్రస్తుతం బైడెన్ అనుసరిస్తున్న వాహన పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో క్యాపిటల్‌ హిల్‌పై దాడి ఘటనలో అరెస్టై బందీలుగా ఉన్నవారిని ట్రంప్ దేశభక్తులుగా అభివర్ణించారు.

అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఆయన ఎన్నికల ప్రచార బృందం అధికార ప్రతినిధి కారోలిన్‌ లీవిట్‌ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. బైడెన్ అనుసరిస్తున్న విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ‘ఆర్థిక రక్తపాతం’ మొదలవుతుందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలపై చేశారని తెలిపింది. దీన్ని బైడెన్ ప్రచార బృందం తప్పుబట్టింది. గతంలో ఘోర ఓటమి చవిచూసిన ట్రంప్ ఈ ఎన్నికల్లో రాజకీయ హింసకు ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని ఆరోపించింది. ట్రంప్ కు మరోసారి ఓటమి తప్పదని వెల్లడించింది.


Also Read: Indian Origin Family Died : కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి.. ప్రమాదమా? హత్యలా ?

ట్రంప్ హయాంలో పెన్స్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కీలక నేత మైక్ పెన్స్ అతనికి షాక్ ఇచ్చారు. ట్రంప్ అభర్థిత్వానికి తాను మద్దతివ్వడం లేదని తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు పార్టీ విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించారని వెల్లడించారు. తాను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రలోబాలకు లొంగకుండా పనిచేశానని.. ట్రంప్ కి తనకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×