EPAPER

Aroori Ramesh will Join In BJP : బీఆర్ఎస్‌కు మరో షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ..!

Aroori Ramesh will Join In BJP : బీఆర్ఎస్‌కు మరో షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ..!

Aroori Ramesh


Aroori Ramesh will Join In BJP : బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కారు మరిన్ని కుదుపులకు లోనవుతోంది. ఇప్పటికే చాలామంది నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకాగానే మరో కీలక నేత కారు దిగిపోయారు.

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసారు. తన రిజైన్ లెటర్ ను గులాబీ బాస్ కేసీఆర్ కు పంపారు. ఆరూరి రమేష్ పార్టీని వీడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి.


ఊహగానాలకు తెరదించుతూ ఆరూరి రమేష్ గులాబీ పార్టీకి రాజీమానా చేశారు. ఆయన బీజేపీలో చేరతారని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారని అంటున్నారు. బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్ పై హామీ రాగానే కారు దిగిపోయారని చర్చ నడుస్తోంది.

Also Read :  బీఎస్పీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా

చాలాకాలం ఆరూరి రమేష్ బీఆర్ఎస్  ఉన్నారు. వర్ధన్నపేటను కంచుకోటగా మార్చుకున్నారు. 2014, 2018 ఎన్నికల్లో బంపర్ మోజార్టీతో గెలిచారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరూరి రమేష్ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు. బీఆర్ఎస్ తో తన బంధాన్ని తెంచుకున్నారు. కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా.. లోక్ సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. బీజేపీ నుంచి ఆఫర్ రావడంతో కారు దిగిపోయారు.

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×