EPAPER

Curry Leaves Benefits : కరివేపాకు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే ఉంటది గురూ!

Curry Leaves Benefits : కరివేపాకు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే ఉంటది గురూ!
curry leaves
curry leaves benefits

Curry Leaves Benefits: కరివేపాకు మనందరికి తెలిసిందే. దీని వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్నింగ్ చేసే బ్రేక్‌ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్‌లో తీసుకునే వంటకాల్లో ఇది ఉండటం కామన్. కానీ రోజు వారి వంటకాల్లో ఉండే ఈ కరివేపాకు ఎవరూ తినరు. దీన్ని చెత్తలా భావించి తీసి పక్కనపెడతారు.


వంటల్లో కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. అంతేకాకుండా ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. కాబట్టి కరివేపాకును చెత్తగా భావించడం మానుకోండి. అలానే కరివేపాకు జుట్టు ఎదుగుదలకు కూడా తోడ్పడుతుందట. కరివేపాకులో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

జీర్ణక్రియ


కరివేపాకు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగితే మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకు ఇది పరిష్కారం చూపుతోంది.

Also Read: జుట్టు ఊడటం మొదలైందా?.. ఈ మిస్టేక్స్ చేయకండి!

రక్తం శుద్ది

కరివేపాకులోయాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. వీటి కారణంగా ముక్కులు మరియు క్రేనీల నుండి విషం బయటకు వెళుతుంది. కరివేపాకు శరీరం మరియు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఇలా జరగాలంటే ఉదయం లేవగానే కాఫీ, టీలకు బంద్ చేసి, కరివేపాకు నీరు తాగాలి. ఇది మొత్తం శరీరాన్ని శుభ్రం చేసి, కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

జుట్టు ఆరోగ్యం

కరవేపాకు జుట్టు ఎదుగుదలకు తోడ్పతుంది. ఇందులో జుట్టు ఎదుగుదలకు ప్రేరేపించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు బలంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. మీ జుట్టు విపరీతంతా రాలుతుంటే కరివేపాకు నీటిని ట్రై చేయండి.

చెడు కొలెస్ట్రాల్

కరివేపాకు ప్రధానంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంపై చెడు కొవ్వు ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. కరివేపాకు నమలడం ఇష్టం లేకపోతే కరివేపాకు నీళ్లు తాగొచ్చు.

Also Read: తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా? .. అయితే ఇది చెక్ చేయండి!

రోగనిరోధక వ్యవస్థ

కరివేపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలానే ఇందులోశక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ బలపరుస్తాయి. మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగండి.

బరువు

కరివేపాకులో పీచుపదార్థాలు ఎక్కువగా.. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గేవారికి ఇది సహాయపడుతుంది. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తాగండి. దీని ద్వారా శరీరంలో జీవక్రియలు పెరిగి కొవ్వులు కరుగుతాయి.

చర్మ ఆరోగ్యం

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కరివేపాకు తీసుకోవడం వల్ల అందులో ఉండే ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మంచి మెరిసే చర్మాన్ని పొందాలంటే ఉదయాన్నే కరివేపాకు నీటిని తాగండి.

Disclaimer: ఈ కథనాన్ని పలు అధ్యయనాల ఆధారంగా, నిపుణుల సలహా మేరకుఅందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×