EPAPER

Ex DSP Praneeth Rao: ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

Ex DSP Praneeth Rao: ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

Ex DSP Praneeth Rao Remand ReportEx DSP Praneeth Rao Remand Report(TS today news): డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయి. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నట్టు తేలింది. చట్ట విరుద్ధంగా తాను చేసిన యవ్వారం బయటకు రాకుండా ఉండేందుకే.. హార్డ్‌డిస్క్‌లను కట్టర్ల సాయంతో డిస్‌మ్యాంటిల్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది.


17 సిస్టమ్‌లతో ఫోన్‌ ట్యాపింగ్ చేసిన ప్రణీత్..దీని కోసం స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఫోన్ల ట్యాపింగ్‌కి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి కదలికలతో పాటు.. ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారనే డేటాను సేకరించి.. ఆ మొత్తం సమాచారాన్ని ఓ బీఆర్‌ఎస్ నేతకు ప్రణీత్ చేరవేసినట్లు తేల్చారు. ఆ బిఆర్‌ఎస్ నేత ఆదేశాలతో 100 నంబర్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇక ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్టులో కొత్త కోణాలు బయటపడ్డాయి. కొంతమందితో కలిసి ప్రణీత్ అక్రమాలకు పాల్పడ్డాడినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని.. పర్సనల్ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసున్నాడు ప్రణీత్. తర్వాత అక్రమాలు బయటపడకుండా హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం చేశాడు. ఎన్నికల ఫలితాల తర్వాత..డిసెంబర్ 4న రాత్రి డిస్క్‌లోని డేటా ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.


Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు.. SIB మాజీ DSP ప్రణీత్‌రావుకి 14 రోజులు రిమాండ్..!

మొత్తం వ్యవహరంలో ప్రణీత్‌రావు మూడు రకాల నేరాలకు పాల్పడినట్లు తేలింది. సాక్ష్యాల చెరిపివేత, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్..ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టాంపరింగ్‌కు పాల్పడినట్ల గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రణీత్ రావు కింది స్థాయి సిబ్బందిని విచారించిన అధికారులు..వారికి కూడా నోటీసులు అందించారు.ఇప్పటికే ప్రణీత్ ల్యాప్‌టాప్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసకున్న పోలీసులు..అందులోని చాటింగ్ సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×