EPAPER

New Election Commissioners : కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి.. సుఖ్‌బీర్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ కు అవకాశం..

New Election Commissioners : కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి.. సుఖ్‌బీర్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ కు అవకాశం..

New Election Commissioners


New Election Commissioners(Telugu breaking news today): కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ పూర్తైంది. కొత్త ఎన్నికల కమిషనర్లుగా పంజాబ్ కు చెందిన సుఖ్ బీర్ సంధూ, కేరళకు చెందిన జ్ఞానాశ్ కుమార్ కు అవకాశం కల్పించారు. కొత్త ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ కు చెందిన లోకసభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి పాల్గొన్నారు.

కొత్త ఎన్నికల కమిషనర్ల పేర్లను కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే అధీర్ రంజన్ చౌధరీ వారి పేర్లను వెల్లడించారు. సుఖ్ బీర్ సంధూ , జ్ఞానేశ్ కుమార్ ను కొత్త ఎన్నికల కమిషనర్లగా ఎంపిక చేసినట్లు తెలిపారు.


తొలుత సెర్చ్ కమిటీ కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ప్రతిపాదిత పేర్లతో లిస్ట్ తయారు చేసిది. సెర్చ్ కమిటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. సెర్చ్ కమిటీ రూపొందించిన జాబితాపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ చర్చించింది.

Also Read: జమిలీ ఎన్నికలపై అధ్యయనం పూర్తి.. రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక

కమిటీ సమావేశం పూర్తైన తర్వాత అధీర్ రంజన్ చౌధరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మొదటి 212 మంది పేర్లను పంపంచారని తెలిపారు. అయితే ప్రధాని నేతృత్వంలోని కమిటీ భేటి 10 నిమిషాల ముందుమాత్రం ఆరుగురి పేర్ల తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. అయితే సుఖ్ బీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ ను చివరకు ఎంపి చేశారని అన్నారు.ఈ కమిటీలో ప్రభుత్వానికే మెజార్టీ ఉందన్నారు. అలాగని కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికను తాను ఏక పక్షమని మాత్రం చెప్పలేనన్నారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియలో లోపాలు ఉన్నాయని వివరించారు. ఈ కమిటీలో సీజేఐ సభ్యుడిగా ఉండాలి స్పష్టం చేశారు.

ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ ఉన్నారు. తాజాగా అరుణ్ గోయెల్ ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. గత నెల మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే రిటైర్ అయ్యారు. దీంతో ఎన్నికల సంఘంలో రెండు ఎన్నికల కమిషనర్ పదవులకు ఖాళాలు ఏర్పడ్డాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో సీజేఐ లేకపోవడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరుగుతుంది.

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×