EPAPER

Receding Hairline : జుట్టు ఊడటం మొదలైందా?.. ఈ మిస్టేక్స్ చేయకండి!

Receding Hairline : జుట్టు ఊడటం మొదలైందా?.. ఈ మిస్టేక్స్ చేయకండి!
Hair Care tips
Receding Hairline

How To Stop Receding Hairline : మన తలపై జుట్టు నిండుగా ఉంటే ఆ కాన్పిడెన్స్ వేరు. జుట్టు ఒత్తుగా ఉండటం వల్ల అందంగా కనిపిస్తారు. తలపై జుట్టు రాలుతుంటే ఆ బాధ చెప్పలేనిది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ తల్లో దురదగా ఉండటం, మాడు కనిపించడం, జుట్టు పలుచబడటం వంటి సమస్యలు ఎదుర్కొంటారు.


తలపై దురదగా ఉండటం, జుట్టు పలుచబడటం, తల చుట్టూ జుట్టు క్రమంగా తగ్గిపోవడాన్ని రిసిడీంగ్ హెయిర్ లైన్ అంటారు. ఈ సమస్యను తగ్గించుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఈ సమస్య రావటానికి మనం చేసే చిన్నచిన్న తప్పులే మొదటి కారణం. ఆ తప్పులెంటో తెలుసుకొని జాగ్రత్త పడితే ఈ సమస్యను దూరం చేయొచ్చు.

Also Read : మేక పాలు.. బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు!


ఈ తప్పులు చేయకండి

  • ముందుగా సమస్యకు అసలు కారణం తెలుసుకోండి.
  • ఇంట్లోనే ట్రీట్మెంట్లు చేయకండి.
  • కుటుంబ చరిత్ర తెలుసుకోండి.
  • జెనిటిక్, ఊబకాయం,మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించండి.
  • జుట్టు హెయిర్ లైన్ దగ్గర ఊడటం మొదలైనప్పుడే గమనించండి.
  • మాడు కనిపించడం,జుట్టు పలచబడటం, నుదురు ఎక్కువగా కనిపిస్తుంటే వైద్యులను సంప్రదించండి.
  • జుట్టులో ఎటువంటి సమస్య లేకుండా చిట్కాలు పాటించకండి.
  • చిట్కాలు పాటించాలంటే నిపుణులను సంప్రదించండి.
  • ఎక్కువ రసాయనాలు ఉన్న షాంపూలు వాడకండి.
  • కండిషనర్లు జుట్టుకు అప్లై చేయకండి.
  • హెయిర్ డ్రయర్లు వాడకండి
  • వేడిగా ఉన్న నీళ్లతో తల స్నానం చేయొద్దు.
  • దీనివల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది
  • జుట్టుకు కలర్స్ ఎక్కువగా వేయకండి.
  • జుట్టును ఎక్కువగా దువ్వకండి.
  • స్మోకింగ్ అలవాటుంటే వెంటనే మానేయండి.
  • జుట్టును బలంగా లాగి కట్టడండి.
  • దీనివల్ల కుదుళ్లు దెబ్బతింటాయి.
  • ఐరన్, జింక్, విటమిన్ డి, బయోటిన్ వంటి ఆహారం తీసుకోండి.
  • చుండ్రు సమస్యలుంటే ముందు అవి తగ్గించుకోవాలి.
  • హెయిర్ ట్రీట్మెంట్లను చేయించుకోకండి.
  • హెల్మెట్, హెయిర్ బ్యాండ్, క్యాప్ తక్కువగా వాడండి.
  • ఇవి హెయిర్ లైన్‌ను దెబ్బతీస్తాయి.
  • జుట్టుకు గాలి తగలకుండా చూసుకోండి.

ఈ జాగ్రత్తలు పాటించండి

పోషకాహారం

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. విటమిన్లు, మినరళ్లు, ప్రొటీన్లున్న ఆహారం తీసుకోండి. ఇవి జుట్టు ఎదుగుదలకు సహాయపడతాయి. గుడ్లు, చేపలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు తినండి. ఆహారంలో తీసుకోండి.

మాడు శుభ్రత

మాడును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. తక్కువ గాఢత ఉన్న షాంపులను వాడండి. వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయొద్దు. జట్టును ఎక్కువగా రుద్దొద్దు. ఎక్కువగా ఆయిల్స్ వాడకండి. జుట్టులో సహజమైన ఆయిల్స్ ఉంటాయని మరచిపోవద్దు. గది ఉష్ణోగ్రత దగ్గర ఉండే నీటితో స్నానం చేయండి.

Also Read : ఇండియన్ టాయిలెట్స్ Vs వెస్ట్రన్ టాయిలెట్స్.. ఏది మంచిది?

ఒత్తిడి

ఒత్తిడి కారణంగా జుట్టు అధికంగా ఊడే ప్రమాదం ఉంది. తరచూ వ్యాయామం, వాకింగ్ చేయండి. వీటిని మీ జీవితంలో ఓ భాగం చేసుకోండి. ఈ అలవాటు మీ జుట్టు ఆరోగ్యానికే కాదు.. మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

Disclaimer: ఈ కథనాన్ని పలు మెడికల్ జర్నల్స్ ఆధారంగా, ఇంటర్నెట్‌లోని సమచారం మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా భావించండి.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×