EPAPER

Ravichandran Ashwin: టెస్టుల్లో అశ్విన్ నెంబర్ వన్ బౌలర్..

Ravichandran Ashwin: టెస్టుల్లో అశ్విన్ నెంబర్ వన్ బౌలర్..

Ravichandran Ashwin latest news


Ashwin Is The Number One Bowler In Test Match(Indian cricket news today): ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకుల్లో టీమ్ ఇండియా వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ గా నిలిచాడు. అంతేకాదు ఇంతవరకు నెంబర్ వన్ స్థానంలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా ను వెనక్కి నెట్టి, తను ముందడుగు వేశాడు. ఇక టాప్ టెన్ లో చూస్తే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఏడో ర్యాంకులో ఉన్నాడు.

ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ తో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కారణంగా టీమ్ ఇండియా ప్లేయర్ల ర్యాంకులు గణనీయంగా మెరుగుపడ్డాయి. టీమ్ ఇండియా కన్నా ఎవరెక్కువ టెస్టు మ్యాచ్ లు ఆడితే వారి పెర్ ఫార్మెన్స్ బట్టి, వారు ముందుకి వెనక్కి వెళుతుంటారు.


Also Read: ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ ఫైనల్ లో.. ఢిల్లీ క్యాపిటల్స్

అయితే ఐసీసీ ర్యాంకులు శాశ్వతం కాదు, ఎప్పటికప్పుడు మారుతుంటాయని చాలామంది అంటుంటారు. కొందరు సీరియస్ గా తీసుకోరు.  కానీ అశ్విన్ అలా కాదు. ప్రతీది సీరియస్ గా తీసుకుంటాడు. తను ఏమంటాడంటే… ఆటలో ఎప్పుడూ ఒక స్పిరిట్ ఉండాలి. లైఫ్ లో ఒక్కసారైనా నెంబర్ వన్ గా ఉండాలనే గోల్ ఉండాలని చెబుతుంటాడు, అలా లేకపోతే ఆటలోనూ వెనుకపడిపోతాం. జీవితం కూడా అంతే. అని ఎక్కువ ఎమోషనల్ పోస్టులు పెట్టే అశ్విన్ అంటుంటాడు.

క్రికెట్ లో గెలవాలి, లైఫ్ లో  చదవాలి, జాబ్ కొట్టాలి, ఫారన్ వెళ్లాలి, ఇలా ఎన్నో గోల్స్ పెట్టుకుని అశ్విన్ లా ట్రై చేస్తే ఆటోమేటిక్ గా ముందడుగు వేస్తామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ముందు మన మనసు ఉత్సాహంగా ఉంటే, వయసు దానికదే సహకిరస్తుంది.అందుకు ఉదాహరణే వెటరన్ ప్లేయర్ అశ్విన్ అని చెబుతున్నారు. నిజానికి ఇంగ్లాండ్ సిరీస్ ముందు ఒక సాధారణ ఆటగాడిగానే ఎంపికయ్యాడు. సిరీస్ ముగిసేసరికి అసాధారణ ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఇక బ్యాటింగ్ లో రెండు సెంచరీలతో అదరగొట్టిన రోహిత్ శర్మ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో ర్యాంకు సాధించాడు. అలాగే యశస్వి జైశ్వాల్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. విరాట్ కొహ్లీ ఎప్పటిలా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా, అశ్విన్ వరుసగా తొలి రెండు స్థానాల్లో ఎప్పటిలా కొనసాగుతున్నారు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×