Top Battery Backup Smart Phones: స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాకప్. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే యాప్స్, ఇతర వినియోగం కారణంగా బ్యాటరీ త్వరగా డిస్ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇచ్చే ఫోన్లు అయితే ఈ సమస్య ఉండదు. కాబట్టి తక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో ఇబ్బంది పడేవారు ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్లు తీసుకుంటే మంచిది. మార్కెట్లో బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే కొన్ని బెస్ట్ ఫోన్లు ఉన్నాయి. అవేంటో చూసేయండి.
Samsung galaxy s24 ultra
సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్24 అల్ట్రా మంచి బ్యాకప్ ఇచ్చే స్మార్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.6.8 ఇంచెస్‌తో డిస్ప్లే దీని సొంతం. 200 మెగాపిక్సెల్‌తో కూడిని కెమెరా సెటప్ ఉంది.
Samsung Galaxy M15
సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్15 బ్యాటర్ బ్యాకప్ కోసం మంచి ఎంపిక. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎమ్ఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీ ఉంది. 6.5 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరా సెటప్ ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
Also Read: 50 మెగాపిక్సెల్‌తో ఐక్యూ నుంచి బడ్జెట్ ఫోన్.. ధర చూస్తే వావ్ అనాల్సిందే..!
Redmi Note13 pro
రెడ్మీ నోట్13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,050 ఎమ్‌ఏహెచ్‌తో బ్యాటరీ ఉంది. ఇది ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇందులో 6.67 ఇంచెస్‌తో బిగ్ స్క్రీన్‌తో లభిస్తుంది. 200 మెగాపిక్సెల్‌తో కూడిన కెమెరా సెటప్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
Asus ROG phone 8 pro
చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్లో పవర్ ఫుల్ బ్యాటరీ ఉంది. 5,500 ఎమ్ఎహెచ్తో కూడిన బ్యాటరీని అందించారు. ఈ ఫోన్లో 6.78 ఇంచెస్‌తో డిస్ప్లే అందించారు. అలానే 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. 32 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
Also Read: ఐఫోన్ 14పై క్రేజీ డీల్.. ధర. రూ.25 వేలు లోపే!
OnePlus 12R
వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కోసం బెస్ట్ ఆప్షన్. ఇందులో5,500 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్ ఫుల్ బ్యాటరీ ఉంది. దీనివల్ల రన్ టైమ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్ప్లేను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్స్ కెమెరా సెటప్ ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫోన్ పనిచేస్తుంది.