EPAPER

Rishabh Pant Back to Cricket: రిషబ్ పంత్ రాక సంతోషదాయకం: సీనియర్లు ప్లేయర్లు

Rishabh Pant Back to Cricket: రిషబ్ పంత్ రాక సంతోషదాయకం: సీనియర్లు ప్లేయర్లు

Rishabh Pant


Senior cricketers on Rishabh Pant’s come back to Cricket: మృత్యువు నుంచి తృటిలో తప్పించుకుని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన రిషబ్ పంత్ మళ్లీ తిరిగి క్రికెట్ ఆడటం చాలా గొప్ప విషయమని సీనియర్ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

భారత క్రికెట్ పై  అతి తక్కువ కాలంలోనే రిషబ్ పంత్ తనదైన ముద్ర వేశాడు. ప్లేయర్, కీపర్, బ్యాటర్ గా ఎంతో మంది మనసులను దోచుకున్నాడు.. షార్ట్ టైమ్లోనే అన్ని ఫార్మాట్లలో టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ రిషబ్ పంత్ మళ్లీ క్రికెట్ లోకి వస్తున్నందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తనని చూసి చాలా బాధ కలిగిందని అన్నాడు. కనీసం మంచం మీద నుంచి అటూ ఇటూ కూడా తిరగలేకపోయేవాడని అన్నాడు. కానీ ఎంతో ఓపికగా, శ్రద్ధగా, పట్టుదలతో తిరిగి క్రికెట్ లో అడుగు పెడుతున్నాడని అన్నాడు. తను రావడం నాకెంతో సంతోషంగా ఉందని తెలిపాడు.


Also Read: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన.. సర్ఫరాజ్ తమ్ముడు

మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా మాట్లాడుతూ సెహ్వాగ్ లాగే పంత్ కూడా పిచ్ ఎలా ఉంది? అటు బౌలర్ ఎవరు? అనే అంశాలను పట్టించుకోడని, దొరికిన బాల్ ని దొరికినట్టు బౌండరీలకు తరలిస్తాడని తెలిపాడు. టెస్టుల్లో అటాకింగ్ బ్యాటింగ్‌తో  మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియాను వాళ్ల సొంత గడ్డపై ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద కూడా కొన్ని మర్చిపోలేని ఇన్నింగ్స్ లు ఆడాడని గుర్తు చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్‌గా గంగూలీ వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఐపీఎల్లో పంత్ తప్పక ఆడతాడని అన్నాడు. ఐపీఎల్ వేలం గురించి రిషబ్తో డిస్కస్ చేశాం. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్ గా పంత్ ఉండాలని అందరం భావిస్తున్నాం’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. సీనియర్లే కాకుండా క్రికెట్ అభిమానులు అందరూ కూడా రిషబ్ పంత్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×