Also Read: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ..
ఇలా అంటూనే హార్దిక్ పాండ్యా విషయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ విషయంలో ముంబయి ఇండియన్స్ తొందరపాటు నిర్ణయం తీసుకుందా? అని ప్రశ్నించాడు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం సరైందేనా? అని అన్నాడు.
పాండ్యా మరి ఐపీఎల్ కి ఫిట్ గా ఉంటే, మరి రెండు నెలలుగా జాతీయ జట్టుకి ఎందుకు ఆడలేదు, ఇటు రాష్ట్ర జట్టుకి ఎందుకు ఆడలేదు…కానీ ఐపీఎల్ కి మాత్రం వచ్చేశాడు అని విమర్శించాడు. డబ్బులు సంపాదించండి తప్పు లేదు, కానీ జాతీయ జట్టులో కాదని ఇలా ఆడి సంపాదించడం మాత్రం సరికాదని అన్నాడు. దేశం కోసం ఆడటాన్ని గర్వంగా ఫీలవ్వాలని తెలిపాడు.
ఐపీఎల్ ఆడటం కోసం నెలరోజులుగా రెస్ట్ తీసుకుని, మంచి ఫిట్ గా, మెంటల్ స్ట్రెంగ్త్ తో వస్తున్నారు. అదే జాతీయ జట్టుకి ఆడమంటే మాత్రం మోకాలి నొప్పి, వెన్నునొప్పి అని సాకులు చెబుతున్నారని విమర్శించాడు. అలాగని నా ఉద్దేశం ఫ్రాంచైజీ క్రికెట్ ని వదిలేయమని కాదని అన్నాడు.
Also Read: Virat Kohli in T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో కోహ్లీకి చోటు దక్కుతుందా..? IPL ప్రదర్శనే కీలకమా..?
ముంబై ఇండియన్స్ మాత్రం కెప్టెన్ మార్పు విషయంలో తొందరపడిందని అన్నాడు. మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ 2024కి ప్రవీణ్ కుమార్ ఇలా స్వాగతం చెప్పాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.