EPAPER

Musheer Khan Breaks Sachin Reocord: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్

Musheer Khan Breaks Sachin Reocord: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్
Musheer Khan latest news
Musheer Khan breaks Sachin Tendulkar Record in Ranji Trophy Final: రంజీ ట్రోఫీలో సచిన్ సృష్టించిన ఒక చారిత్రాత్మకమైన రికార్డు ని సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ బ్రేక్ చేశాడు. ఇటీవల అండర్ 19లో తన ప్రతిభను చాటిన ముషీర్ ఖాన్ ఇప్పుడు ముంబై రంజీ ఫైనల్ లో సెంచరీ (136) చేశాడు. దీంతో సెంచరీ చేసిన అతి చిన్నవయస్కుడిగా అవతరించాడు. అయితే అది కూడా సచిన్ స్టేడియంలో ఉండగానే, తన కళ్ల ముందే చేయడం విశేషం.

అంతకుముందు సచిన్ టెండూల్కర్ 1994-95 సీజన్ ఫైనల్ లో పంజాబ్ పై ఏకంగా రెండు సెంచరీలు చేశాడు. అప్పటికి సచిన్ వయసు 22 ఏళ్లు. కానీ ముషీర్ ఖాన్ 19 ఏళ్ల 14 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. దీంతో రంజీ ఫైనల్లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాటర్ గా గుర్తింపు పొందాడు.


విదర్భతో జరిగిన రంజీ ఫైనల్ మ్యాచ్ లో ముంబై రెండు కీలకమైన వికెట్లు కోల్పోయిన దశలో ముషీర్ ఖాన్ అద్భుతంగా ఆడాడు. ముంబై కెప్టెన్ ఆజింక్యా రహానే (73), శ్రేయాస్ అయ్యర్ (95) తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నిర్మించాడు. ఈ మ్యచ్ తో శ్రేయాస్ అయ్యర్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. అందరినోళ్లూ మూయించాడు. అలాగే రహానె కూడా కెప్టెన్ కావడంతో బాధ్యతగా ఆడాడు.

Also Read: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీకి చోటు దక్కుతుందా? ఐపీఎల్ ప్రదర్శనే కీలకమా?


మొత్తానికి సర్ఫరాజ్ ఖాన్ , ముషీర్ ఖాన్ బ్రదర్స్ ఇద్దరూ ఒకేసారి జాతీయ జట్టులో ఆడే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. ఎందుకంటే అన్న సర్ఫరాజు ఇటీవలే ఇంగ్లాండ్ సిరీస్ లో అడుగుపెట్టి ధనాధన్ ఆడి అందరినీ మెప్పించాడు. ఎంతోమంది క్రికెటర్లు వస్తుంటారు, వెళుతుంటారు. కానీ సర్ఫరాజ్ మాత్రం తనలో ఒక ప్రత్యేకత ఉందని మాత్రం నిరూపించాడు.

ముషీర్ ఖాన్ వరుసపెట్టి ఇలా సెంచరీలు చేస్తూ, రేపు ఐపీఎల్ లో కూడా అదరగొడితే రాబోయే రోజుల్లో జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా మారుతాడని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×