EPAPER

Surya Kumar Yadav Miss IPL 2024: స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డౌటేనా..?

Surya Kumar Yadav Miss IPL 2024: స్టార్ బ్యాటర్  సూర్యకుమార్ యాదవ్ డౌటేనా..?

SURYAKUMAR YADAV Latest news


Suryakumar Yadav May Not Start IPL 2024 For Mumbai Indians: ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతుండటంతో ఒకటే సందడి మొదలైంది. గాయాల పాలై వెళ్లినవాళ్లు తిరిగి తమ తమ జట్లలోకి వస్తున్నారు.. మృత్యువు వరకు వెళ్లి వచ్చిన రిషబ్ పంత్ తిరిగి వచ్చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఇదివరకే జట్టులో చేరిపోయాడు. కొహ్లీ కూడా ఆడేలాగే ఉన్నాడు. కేఎల్ రాహుల్ ఫిట్ గా ఉన్నాడని, ఐపీఎల్ లో ఆడుతున్నాడని బీసీసీఐ ప్రకటించింది. మహ్మద్ షమీ సెప్టెంబరు నాటికి గానీ రెడీ కాడని తేల్చి చెప్పేసింది. ఇంక అందరూ అయిపోయారు. ఒకే ఒక్కడు మిగిలి ఉన్నాడు.

అతనే స్టార్ బ్యాటర్, టీ 20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతం తను స్పోర్ట్స్ హెర్నియా సర్జరీని విదేశాల్లో చేయించుకున్నాడు. తిరిగి వచ్చి ఎన్సీఏలో చేరాడు. అయితే ఇంకా బ్యాటింగ్ ప్రాక్టీసు ప్రారంభించలేదని అంటున్నారు. దీంతో తనెప్పుడు బ్యాటింగ్ స్టార్ట్ చేస్తాడు? ఎప్పుడు ఎన్సీఏ సర్టిఫికెట్ ఇస్తుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ మొదటి రెండు మ్యాచ్ లకి అందుబాటులో ఉండకపోవచ్చునని సమాచారం. దీంతో ముంబై జట్టుకి మూలిగే నక్కపై తాటి పండు పడినట్టయ్యింది.


Also Read: ముంబై జట్టులో చేరి, కొబ్బరి కాయ కొట్టిన పాండ్యా..

మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ లేకపోవడం ముంబై జట్టుకి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రడీ రోహిత్ శర్మ డౌటుగానే ఉంది. ఇప్పుడు సూర్య కూడా డౌటే. దీంతో ఇద్దరు హిట్టర్లు దూరం కావడంతో తొలి మ్యాచ్ ఎలా గడుస్తుందనే టెన్షన్ లో ముంబై ఇండియన్స్ ఉందని సమాచారం.

సూర్యకుమార్ యాదవ్ ఒక్కడుంటే చాలు, టీ 20 లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడనే పేరుంది. మరి తిరిగి జట్టులోకి వచ్చి మళ్లీ మునుపటి ఫామ్ అందుకోవడానికి కొంత సమయం పట్టేలాగే ఉంది. ఈలోపు ముంబై ఇండియన్స్ పాయంట్ల పట్టికలో వెనుకపడిపోతే ప్రమాదమనే అంటున్నారు.

రోహిత్ శర్మ లేకుండా హార్దిక్ పై నమ్మకం ఉంచిన ముంబై జట్టుకి ఇది అగ్నిపరీక్షే అని చెప్పాలి. మరి హార్దిక్ పాండ్యా జట్టునెలా నడిపిస్తాడనేది వేచి చూడాల్సిందే.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×