EPAPER

Oscars 2024 Winning Movies OTT Platforms: ఆస్కార్ 2024 గెలిచిన సినిమాలు చూసారా..? లేదా అయితే ఈ ఒటీటీల్లో చూడండి!

Oscars 2024 Winning Movies OTT Platforms: ఆస్కార్ 2024 గెలిచిన సినిమాలు చూసారా..? లేదా అయితే ఈ ఒటీటీల్లో చూడండి!
Oscar Winning Movies on OTT:
Oscar Winning Movies on OTT:

Oscar 2024 Winning Movies on OTT Platforms: 96వ ఆస్కార్ అవార్డుల వేడుక నిన్న అంటే సోమవారం (మార్చి 11)న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో పలు సినిమాలు, సిరీస్‌లు వివిధ విభాగాల్లో అవార్డులను అందుకున్నాయి.


ముఖ్యంగా అందరూ ఊహించినట్టుగానే ఓపెన్‌హైమర్ సినిమాకు ఎక్కువగా అవార్డులు వచ్చాయి. దాదాపు ఓపెన్‌హైమర్ మూవీ 7 అవార్డులను దక్కించుకుంది. వీటితో పాటు మరో మూవీ పూర్ థింగ్స్ కూడా పలు అవార్డులను సాధించింది.

అలాగే మరికొన్ని చిత్రాలు, డాక్యుమెంటరీ సిరీస్‌లు కూడా అవార్డులను సొంతం చేసుకున్నాయి. అయితే చాలా మంది సినీ ప్రియులు ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకున్న ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయో అని తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అలాంటి వారికోసం ఓ గుడ్‌న్యూస్. ఆస్కార్ అవార్డులు గెలుసుకున్న సినిమాలు ఏ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం.


Also Read: అవార్డులు కొల్లగొడుతున్న ఓపెన్‌హైమర్.. విజేతల లిస్ట్ ఇదే..

2024 ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సినిమా ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్‌ విభాగంలో మొత్తం 7 అవార్డులను సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచిన సినిమా ‘ఓపెన్‌హైమర్’.

ఈ మూవీ ప్రస్తుతం జియో సినిమా, అమెజాన్ ప్రైమ్, బుక్ మై షో వంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్‌లలో రెంటల్ పద్దతిలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ వంటి భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మార్చి 21 నుంచి జియో సినిమాలో ఉచితంగా ఈ మూవీని వీక్షించవచ్చు.

అలాగే ఈ మూవీ తర్వాత స్థానంలో అత్యధిక అవార్డులను అందుకున్న సినిమా పూర్ థింగ్స్. ఈ మూవీ బ్లాక్ కామెడీ జానర్‌లో రూపొందింది. ఈ మూవీ ఉత్తమ నటి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, ఉత్తమ ప్రొడక్షన్ విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది.

ఈ సినిమా ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే యూట్యూబ్‌లో రెంటల్ పద్దతిలో ఉంది. ఈ సినిమాలతో పాటు బెస్ట్ డాక్యుమెంటరీ(షార్ట్‌‌సబ్జెక్ట్‌) అవార్డు అందుకున్న ది లాస్ట్‌ రిపేర్‌ షాప్ ప్ర‌స్తుతం డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: ఆస్కార్ వేదికపైకి నగ్నంగా జాన్‌సీనా.. వీడియో వైరల్..

అంతేకాకుండా లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌‌ఫిల్మ్ అవార్డు సాధించిన ది వండర్‌ఫుల్‌ స్టోరీ ఆఫ్‌ హెన్రీ సుగర్ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు కైవసం చేసుకున్న బార్బీ మూవీ నుంచి ‘వాట్‌ వాస్ ఐ మేడ్‌ ఫర్’. ఈ మూవీ ఇప్పుడు జియో సినిమాలో చూడొచ్చు.

బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌‌ప్లే అవార్డును సొంతం చేసుకున్న కార్డ్ జెఫర్‌పన్‌ అమెరికన్‌ ఫిక్షన్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో, బెస్ట్ సహాయ నటి విభాగంలో అవార్డును అందుకున్న అమెరిక‌న్ కామెడీ డ్రామా చిత్రం ది హోల్డోవర్స్ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.

కానీ భారత్‌లో ఇంకా స్ట్రీమింగ్‌కు రాలేదు. ఈ మూవీ మార్చి 29 నుంచి రెంటల్ ప‌ద్ద‌తిలో బుక్ మైషోలో అందుబాటులోకి రానుంది. అలాగే బెస్ట్ సౌండ్ విభాగంలో ది జోన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్, బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌, బెస్ట్ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ విభాగంలో అవార్డు కైవసం చేసుకున్న వార్‌, డ్రామాడాక్యుమెంట‌రీ దిజోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్, బెస్ట్ డాక్యుమెంట‌రీ చిత్రంగా 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్ వంటి చిత్రాలు ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Also Read: అందర్నీ ఫూల్స్ చేసిన జాన్‌సీనా.. ఆస్కార్ వేదికపైకి నగ్నంగా రాలేదు.. ఇదిగో ఫుల్ ఫోటో..

అయితే ఈ సినిమాలు ఇంకా ఇండియాలో స్ట్రీమింగ్‌కు రాలేదు. అంతేకాకుండా బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్ విబాగంలో జపనీస్ చిత్రం గాడ్జిల్లా మైనస్‌ వన్, బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్ ది బాయ్‌ అండ్‌ ది హిరాన్, మూవీలు ఇంకా థియేటర్లలో నడుస్తున్నాయి. వీటికి ఇంకా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్‌లు సెట్ కాలేదు.

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Big Stories

×