This Week OTT And Theater Release Movies: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సారి థియేటర్లలో చిన్న సినిమాలదే హవా. ఏకంగా 10కి పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా మరోవైపు ఓటీటీలో కూడా పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెయ్ దరువెయ్:
సాయిరాం శంకర్, యషా శివకుమార్ హీరో హీరోయిన్గా నటిస్తోన్న కొత్త సినిమా ‘వెయ్ దరువెయ్’. నవీన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మార్చి 15 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సునీల్, సత్యం రాజేష్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
రజాకార్:
యాటా సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘రజాకార్’. బాబీ సింహా, వేదిక, ప్రేమ, ఇంద్రజ, అనుష్య త్రిపాఠి, అనసూయ, మకరంద్ దేశ్ పాండే ఈ మూవీలో నటీ నటులుగా ఉన్నారు. భీమ్స్ సిసిరిలియో అందిస్తున్న ఈ చిత్రాన్ని గూడురు నారాయణరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ మార్చి 15న రిలీజ్ కానుంది.
తంత్ర:
శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగళ్ల, ధనుష్, సలోని తదితరులు కీలక పాత్ర పోషిస్తోన్న కొత్త సినిమా తంత్ర. ఈ సినిమా మార్చి 15న రిలీజ్ కానుంది.
ఈ చిత్రాలతో పాటు షరతులు వర్తిస్తాయి!, లైన్‌మ్యాన్, రవికుల రఘురామ, లంబసింగి, యోధ, ప్రేమలో ఇద్దరు, కుంగ్‌ఫూ పాండా4, మాయ 2024 వంటి సినిమాలు కూడా థియేటర్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు
జియో సినిమా:
హనుమాన్ (హిందీ) మార్చి16
ట్రాల్స్బ్యాండ్ టుగెదర్(ఇంగ్లీష్ మూవీ) – మార్చి17
నెట్‌ఫ్లిక్స్
టూ కిల్ ఏ టైగర్(హిందీ) మార్చి10
యంగ్ రాయల్స్ సీజన్3(స్వీడిష్ సిరీస్) మార్చి11
జీసస్ రివల్యూషన్(ఇంగ్లీష్ సినిమా) మార్చి12
టర్నింగ్ పాయింట్(ఇంగ్లీష్ సిరీస్) మార్చి12
బండిడోష్(స్పానిష్ సిరీస్) మార్చి13
24హవర్స్ విత్ గాస్పర్(ఇంగ్లీష్ సినిమా) మార్చి14
గర్ల్స్ 5ఎవా: సీజన్3(ఇంగ్లీష్ సిరీస్) మార్చి 14
లాల్ సలామ్(తమిళ) మార్చి 15
చికెన్ నగ్గెట్(కొరియన్ సిరీస్) మార్చి15
ఐరిష్విష్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి15
ఐరన్ రియన్(స్పానిష్ సిరీస్) – మార్చి 15
మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) – మార్చి 15
అమెజాన్ ప్రైమ్
లవ్ అదురా(హిందీ సిరీస్) – మార్చి13
ఇన్విన్సబుల్ సీజన్2 పార్ట్2 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి14
బిగ్గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) మార్చి14
ఫ్రిడా(ఇంగ్లీష్ మూవీ) – మార్చి15
డిస్నీ+హాట్‌స్టార్
లవర్(తమిళ చిత్రం) మార్చి15
సేవ్‌ది టైగర్స్2 (తెలుగు సిరీస్) మార్చి15
గ్రేస్ అనాటమీ: సీజన్20 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి15
టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్టూర్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి15
సోనీలివ్
భ్రమయుగం(మలయాళం/తెలుగు) మార్చి15
లయన్స్ గేట్‌ప్లే
నో వే అప్(తెలుగు వెర్షన్) మార్చి15
జీ5
మే అటల్ హూ(హిందీ) మార్చి14
ఆపిల్ ప్లస్ టీవీ
మ్యాన్ హంట్(ఇంగ్లీష్ సిరీస్) – మార్చి15
బుక్ మై షో
ద డెవిల్ కాన్స్పరసీ(ఇంగ్లీష్ సినిమా) – మార్చి15