EPAPER

Buttermilk Benefits : భోజనం తర్వాత మజ్జిగ తాగితే బోలెడు లాభాలు.. తెలిస్తే మిస్ చేయరు..!

Buttermilk Benefits : భోజనం తర్వాత మజ్జిగ తాగితే బోలెడు లాభాలు.. తెలిస్తే మిస్ చేయరు..!
Butter Milk Benefits in Summer
Butter Milk Benefits in Summer

Buttermilk Benefits in Summer: వేసవి మొదలై ఎండలు మండుతున్నాయి. వేసవితాపం నుంచి బయటపడేందుకు చాలామంది కూల్ డ్రింక్స్, ఇతర పానియాలు తాగుతున్నారు. అయితే ఈ సీజన్‌లో మజ్జిక ఒక గ్లాసు మీ కడుపులో పడితే ఆరోగ్యానికి ఏంతో మేలు. మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత దీన్ని తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఎసిడిటిని కూడా నివారిస్తుంది.


మజ్జిగ అద్భుతమైన పానీయం. దీన్ని సీజన్‌తో సంబంధం లేకుండా తీసుకోవచ్చు. ఇందులో ప్రోబయోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. సమ్మర్‌‌లో వేడి ఉష్ణోగ్రతల నుంచి పేగు ఆరోగ్యాన్ని మజ్జిక రక్షిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం ఎలక్ట్రోలైట్‌లకు మంచి మూలం. శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో మజ్జిగ సహాయపడతాయి.

Read More: ఈ ప్రదేశంలో తరచూ నొప్పి ఉంటుందా.. బ్రెయిట్ ట్యూమర్ కావొచ్చు!


అంతేకాకుండా మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ B12, ప్రోటీన్ వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. ఇందులో యాంటీమైక్రోబయల్ గుణాలు కలిగి ఉండే లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తని పెంచుతుంది. మజ్జిగను ఎటువంటి సమయంలో అయినా తీసుకోవచ్చు. కానీ భోజనం తర్వాత తీసుకుంటే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పోషకాహార శక్తి పెరుగుదల

మజ్జిగ అనేది పాలపదార్థాలలో ఒకటి. ఇందులో పుష్కలంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల మీ పోషకాహార శక్తి పెరిగి ఉత్సాహంగా ఉంటారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

మజ్జిగలో లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియా వంటి ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ బ్యాక్టీరియా మన పేగులోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. తద్వారా పొట్టలో గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

డీహైడ్రేషన్ నుంచి రక్షణ

మజ్జిగలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇది మన శరీరానికి సరైన హైడ్రేషన్‌ను అందిస్తుంది. మధ్యాహ్నం మజ్జిగ తాగడం వల్ల మీ శరీరంలోని నీటి స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.

తాజాదనం

మజ్జిగ తాగిన తర్వాత ప్రశాంతంగా ఉంటారు. దీనివల్ల చల్లని మరియు విశ్రాంతి గుణాలు మీ మనస్సుపై ఏర్పడతాయి. ఫలితంగా మనస్సు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలను సంతోషంగా చేయగలుగుతారు.

విటమిన్లు మరియు ఖనిజాలు

మజ్జిగలో మన శరీరానికి అవసరమైన కాల్షియం, పొటాషియం, విటమిన్ బి వంటి విటమిన్లు మరియు మినరల్స్ సమతుల్యంగా ఉంటాయి. ఈ మూలకాలు శరీరాన్ని ఆరోగ్యంగా , బలంగా చేస్తాయి.

Read More: పిల్లలకు నత్తి ఉంటే ఎలా తగ్గించాలి?

యాసిడ్ రిఫ్లక్స్‌లో సహాయపడుతుంది

మజ్జిగ జీర్ణవ్యవస్థకు శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తుంది. అందులోని యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా కడుపు లైనింగ్‌లో ఏర్పడే చికాకు తగ్గుతుంది.

IBS నుంచి రిలీఫ్

మజ్జిగ జీర్ణక్రియలో సహాయపడుతుంది. అందులో ఉండే యాసిడ్‌లు పొట్టను క్లియర్ చేస్తాయి. మజ్జిగ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు.

Disclaimer : ఈ కథనాన్ని పలు అధ్యయనాల ప్రకారం, ఆరోగ్య నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×