EPAPER

Indian Cricket Team: “ప్రపంచ క్రికెట్ లో రారాజు.. టీమ్ ఇండియా” అన్నింటా మనమే టాప్!

Indian Cricket Team: “ప్రపంచ క్రికెట్ లో రారాజు.. టీమ్ ఇండియా”  అన్నింటా మనమే టాప్!
India claim top spot in the ICC Test Team Rankings
India claim top spot in the ICC Test Team Rankings: ఐసీసీ ర్యాంకుల్లో టీమ్ ఇండియా యమా జోరుగా ఉంది. అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ గా ఉండి, ప్రపంచ క్రికెట్ లో రారాజుగా ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో 4-1 తేడాతో మొన్నటి వరకు టెస్టుల్లో ఆస్ట్రేలియా నెంబర్ వన్ గా ఉండేది. ఇప్పుడా జట్టుని దాటుకుని టీమ్ ఇండియా నెంబర్ వన్ స్థానానికి వెళ్లింది. ప్రస్తుతం 122 పాయింట్లతో అగ్రస్థానానికి వెళ్లింది. ఆస్ట్రేలియా 117 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

భారత్ చేతిలో సిరీస్ కోల్పోయినప్పటికి ఇంగ్లాండ్ 111 పాయింట్లతో మూడో స్థానంలో ఉండటం గమనార్హం. ఇక న్యూజిలాండ్ 101 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 99 పాయింట్లతో తర్వాత స్థానంలో ఉంది.


ఇకపోతే వన్డేల్లో చూస్తే 121 పాయింట్లతో టీమ్ ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంటే, 110 పాయింట్లతో సౌతాఫ్రికా మూడో స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో పాకిస్తాన్ (109), న్యూజిలాండ్ (102) ఉన్నాయి.

Read More: గిల్ ని గిల్లిన బెయిర్ స్టో.. మధ్యలో సర్ఫరాజ్ ఎంట్రీ


టీ 20ల్లో కూడా 266 పాయింట్లతో టీమ్ ఇండియా నెంబర్ వన్ గా ఉంది. తర్వాత ఇంగ్లాండ్ (256), ఆస్ట్రేలియా (255), న్యూజిలాండ్ (254), పాకిస్తాన్ (249) వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఉన్నాయి.
ఇలా ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉంది.

వీటన్నింటితో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో కూడా టీమ్ ఇండియా 68.56 శాతంతో మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో 60 శాతంతో న్యూజిలాండ్, 59.09 శాతంతో ఆస్ట్రేలియా నిలిచాయి. ఇలా నాలుగింటిలో కూడా టీమ్ ఇండియా అగ్రస్థానం దక్కించుకుని ప్రపంచ క్రికెట్ లో రారాజుగా ఉంది.

Tags

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×