EPAPER

Pakistans : ఫైనల్ చేరగానే తలకెక్కిన పొగరు

Pakistans : ఫైనల్ చేరగానే తలకెక్కిన పొగరు

Pakistans : నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో అదృష్టం పండి సెమీస్ చేరి… ఆపై కివీస్ పేలవ ఆటతీరు కారణంగా పాకిస్థాన్ ఫైనల్ చేరిందో లేదో… ఆ దేశ ప్రధాని దగ్గర్నుంచి, పీసీబీ చీఫ్ రమీజ్ రాజా, మాజీ ఆటగాళ్ల దాకా… అందరికీ గర్వం పీక్స్ కు చేరింది. అందుకే అవాకులు చెవాకులు పేలుతూ… భారత అభిమానుల నుంచి చివాట్లు తింటున్నారు.


ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోగానే… పాక్ ప్రధాని చేసిన ట్వీట్ భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఇంతకీ పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఏం ట్వీటాడంటే… వరల్డ్ కప్ ఫైనల్లో 152/0 Vs 170/0 అని రాసుకొచ్చాడు. అంటే… నిరుడు T20 ప్రపంచకప్ లో భారత్ పై పది వికెట్ల తేడాతో గెలిచిన పాక్ జట్టుకు… తాజా T20 వరల్డ్ కప్ లో టీమిండియాపై గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు మధ్య ఫైనల్ మ్యాచ్ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు… పాక్ ప్రధాని. దాంతో… ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి సెమీస్ చేరిన మీరు… ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రాన హీరోలు కాదు… ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన మా వాళ్లు జీరోలు కాదు అంటూ భారత అభిమానులు కౌంటర్లిస్తున్నారు.

ఇక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజా రాజా అయితే టీమిండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. బీసీసీఐని హేళన చేస్తూ మాట్లాడాడు. పాక్ జట్టుపై అనుమానపడ్డవాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని… అదే సమయంలో బిలియన్‌ డాలర్‌ ఇండస్ట్రీ టీమ్‌ ఇంటికెళ్లిపోయిందంటూ అవాకులు చెవాకులు పేలాడు. గత నెలలో ముగ్గురు పాక్ ప్లేయర్స్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా నిలిచారని… తామేంటో చెప్పడానికి అదొక్కటీ చాలని గొప్పలు చెప్పుకున్నాడు. దాంతో.. సందు దొరికితే చాలు టీమిండియాపై విషం కక్కడం తప్ప మీకు వేరే పని లేదంటూ భారత అభిమానులు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఫైనల్ కు వెళ్లామని సంబరపడకండి… ఇంగ్లండ్ చేతిలో మీకు కూడా మూడింది అంటూ చురకలంటిస్తున్నారు. ఇక టీమిండియాను విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా… భారత్ కు ఫైనల్ చేరే అర్హత లేదంటూ నోరు పారేసుకున్నాడు.


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×