EPAPER

Congress-DMK Seat Deal: తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే మధ్య కుదిరిన ఒప్పందం.. తొమ్మిది స్థానాల్లో హస్తం పోటీ..

Congress-DMK Seat Deal: తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే మధ్య కుదిరిన ఒప్పందం.. తొమ్మిది స్థానాల్లో హస్తం పోటీ..

Congress-DMK Seat DealCongress-DMK Seat Deal(Political news telugu): తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్ధుబాటు పూర్తయినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 9 స్థానాలు, పుదుచ్చేరిలో ఒక స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది.


మొత్తం తమిళనాడులో 39 ఎంపీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ డీఎంకే పొత్తులో భాగంగా 21 స్థానాల్లో డీఎంకే, 9 స్థానాల్లో కాంగ్రెస్, వీసీకే పార్టీ 2, సీపీఐ(ఎం) 2, సీపీఐ 2, ముస్లీం లీగ్ 1, ఎండీఎంకే 1, కేఎండీకే ఒక్క స్థానంలో పోటీ చేయనున్నాయి. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్‌కు 2025లో ఒక రాజ్య సభ సీటును కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

2019లో 10 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో 2024 ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని హస్తం పార్టీ భావిస్తోంది. తమిళనాడు సీఎం డీఎంకే అధ్యక్షుడు ఎం కే స్టాలిన్, టీసీసీసీ అధ్యక్షుడు సెల్వపెరున్‌తగాయ్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, అజయ్ కుమార్ శనివారం సీట్ల సర్ధుబాటుపై సమావేశం నిర్వహించారు.


Read More: డీఎంకే కాంగ్రెస్‌ కూటమితో ఎంఎన్ఎమ్ పొత్తు.. పోటీకి దూరంగా కమల్ హాసన్ పార్టీ..

డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం సంతోషంగా ఉందని.. తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 సీట్లు గెలుస్తామని కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఇక దేశం కోసం తమ కూటమిలో కమల్ హాసన్ చేరారని.. వారికి ఒక రాజ్య సభ సీటును కేటాయిస్తామని ఆయన తెలిపారు.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×