EPAPER

India vs England: పరుగుల్లో యశస్వి , వికెట్లలో అశ్విన్ టాప్

India vs England: పరుగుల్లో యశస్వి , వికెట్లలో అశ్విన్ టాప్
India vs England
 

India vs England Cricket Players Records( sports news in telugu): ఎట్టకేలకు సుదీర్ఘమైన ఇంగ్లాండ్ సిరీస్ ఇండియాలో ముగిసింది. 4-1 తేడాతో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది.  అయితే రికార్డుల మీద రికార్డులు వచ్చి చేరాయి. సిరీస్ లో చూస్తే అత్యధిక పరుగులు చేసిన వారిలో యశస్వి జైశ్వాల్ 712 పరుగులు చేసి నెంబర్ వన్ గా ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ 26 వికెట్లు తీసి నెంబర్ వన్ గా నిలిచాడు.


పరుగుల పరంగా టాప్ 5లో చూస్తే ముగ్గురు ఇండియన్స్ ఉన్నారు. ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాటర్లు ఉన్నారు.
ఎవరెన్ని పరుగులు చేశారో వరుసగా చూస్తే…
1.యశస్వి జైశ్వాల్….  712
2. శుభ్ మన్ గిల్……     452
3. జాక్ క్రాలీ (ఇంగ్లాండ్) 407
4. రోహిత్ శర్మ               400
5. బెన్ డకెట్ (ఇంగ్లాండ్) 343
వీరు టాప్ 5లో నిలిచారు. ఫామ్ కోల్పోయాడని శుభ్ మన్ గిల్ పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో తనెంతో మానసిక స్థయిర్యంతో ఆడి రెండు సెంచరీలు, రెండు ఆఫ్ సెంచరీలు చేశాడు. ఒక మ్యాచ్ లో 91 పరుగులు చేసి అనుకోకుండా రన్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విమర్శల పాలయ్యాడు. కానీ సిరీస్ లో రెండు సెంచరీలు చేశాడు. టాప్ 5లో నిలిచాడు.

ఇంగ్లాండ్ నుంచి ఒలిపోప్ తొలి టెస్ట్ లో 196 పరుగులు చేశాడు. తర్వాత మళ్లీ ఆకట్టుకోలేక పోయాడు. ఓపెనర్లు  జాక్ క్రాలీ, బెన్ డకెట్ ఇద్దరూ ఇంగ్లాండ్ లో టాప్ 2లో ఉన్నారు.


బౌలింగ్ విషయానికి వస్తే వెటరన్ బౌలర్ అశ్విన్ కి ఇంగ్లాండ్ సిరీస్ ఒక మధురమైన జ్నాపకంగా మిగిలిపోతుంది. తన కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లను ఈ సిరీస్ లో అధిగమించాడు. ముఖ్యంగా బౌలింగ్ లో 26 వికెట్లు తీసి నెంబర్ వన్ గా నిలిచాడు.

బౌలింగ్ లో టాప్ 5 లో చూస్తే, నలుగురు ఇండియన్స్ ఉన్నారు, ఒకరు ఇంగ్లాండ్ నుంచి ఉన్నారు.
అశ్విన్ ……….        26
టామ్ హార్ట్ లీ           22
బుమ్రా….               19
కులదీప్ యాదవ్….  19
రవీంద్ర జడేజా         18

Tags

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×