EPAPER

Rohit Sharma: సచిన్ రికార్డుని సమం చేసిన రోహిత్ శర్మ..

Rohit Sharma: సచిన్ రికార్డుని సమం చేసిన రోహిత్ శర్మ..

rohith sharma new record


Rohit Sharma Equals Sachin Tendulkar’s Monumental Record(Cricket news today telugu): ఇదేమిటి? అనుకుంటున్నారా? సచిన్ 100 సెంచరీలు చేశాడు కదా…రోహిత్ వి అన్నీ కలిపి 48 సెంచరీలే కదా…అని ఆశ్చర్యపోతున్నారా… అదేమీ లేదండీ…

అంతర్జాతీయ క్రికెట్ లో  30 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన రోహిత్ శర్మ చేరాడు. ఇంతకీ సచిన్, రోహిత్ శర్మలు ఎన్ని సెంచరీలు చేశారంటే 30 ఏళ్ల తర్వాత ఇద్దరూ 35 సెంచరీలు చేశారు. వీరికన్నా ముందు  ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 43 సెంచరీలతో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. తన తర్వాత 36 సెంచరీలతో ఆస్ట్రేలియా దిగ్గజాలు మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్ లు ఉన్నారు.

ధర్మశాల టెస్టులో సెంచరీతో రోహిత్ శర్మ తన కెరీర్ లో 12వ టెస్ట్ సెంచరీని రోహిత్ శర్మ పూర్తి చేసుకున్నాడు. 162 బంతుల్లో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం.


Read more: సర్ఫరాజ్ ఎందుకలా ఆడావ్? : సునీల్ గవాస్కర్ ప్రశ్న

36 ఏళ్ల రోహిత్ శర్మ కెరీర్ చరమాంకంలో ఉన్నట్టే అనుకోవాలి. మహా అయితే మరో రెండేళ్లు గట్టిగా ఆడతాడు. తర్వాత తనంతట తనే రిటైర్ అవుతాడని అంటున్నారు. అందరూ అనుకునేదేమిటంటే జూన్ లో  జరిగే ఐపీఎల్ టీ 20 ప్రపంచకప్ తో,  ఇక పొట్టి మ్యాచ్ లకి కొహ్లీ, అశ్విన్, రోహిత్ శర్మ కూడా గుడ్ బై చెబుతారని అనుకుంటున్నారు.

ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి కూడా రోహిత్ శర్మని తప్పించారు. దీంతో తను వేరే జట్టు వెతుక్కుంటాడని అంటున్నారు. బహుశా ముంబై ఇండియన్స్ కి ఆడటం ఇదే ఆఖరని కూడా అంటున్నారు. ఆడకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే వారితో అగ్రిమెంటు ఉంటుంది. అది పూర్తికావాలి. ఎలాగూ వచ్చే ఏడాది మెగా వేలం ఉంటుంది. తన కాంట్రాక్టు కూడా అయిపోతుంది.

మొత్తానికి రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ లో శిఖరాగ్ర స్థాయికి ఎదిగిన రోహిత్ శర్మ నెమ్మదిగా ఇక తిరుగుముఖం పడుతున్నాడు. ఒకొక్కమెట్టు దిగి వచ్చేలాగే కనిపిస్తున్నాడు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×