EPAPER

Vasireddy Padma : పదవికి అందుకే రాజీనామా చేశా : వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma : పదవికి అందుకే రాజీనామా చేశా : వాసిరెడ్డి పద్మ

vasireddy padma latest news


Vasireddy Padma About her Resignation(Andhra news today): ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా పత్రాన్ని నేరుగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందంచారామె. వాసిరెడ్డి పద్మ రాజీనామాతో వైసీపీకి మరో షాక్ తగిలిందని భావించారు. కానీ.. తాజాగా ఆమె పదవికి ఎందుకు రాజీనామా చేశారో వివరించారు.

రాష్ట్రంలో మహిళా సాధికారత అంటే ఏమిటో చూపించిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని కొనియాడారు. గత ప్రభుత్వాలు చెప్పిన మహిళా సాధికారత మాటలకే పరిమితమైతే.. ఈ ప్రభుత్వం మాత్రం అది చేసి చూపించిందన్నారు. కుటుంబానికి కేంద్రం మహిళ అని నిరూపించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని కితాబిచ్చారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రతి మహిళ భుజానికి ఎత్తుకోవాలని పిలుపునిచ్చారు వాసిరెడ్డి పద్మ.


అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీ కోసం పనిచేసేందుకే పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల గురించి ఆలోచించేవారు, మహిళల ఎదుగుదలకు కృషి చేసేవారు, వారంతా బాగుండాలని కోరుకునేవారంతా వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. తాను రాజకీయాల్లోకి రాకముందు అనేక సంఘాల్లో పనిచేశానని, ఒక న్యాయవాదిగా మహిళల కష్టాల్ని చూశానన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పల్లె ప్రాంతాల్లో సైతం మహిళా సాధికారత కనిపిస్తోందని, మహిళల కోసం కృషిచేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మీడియా మిత్రులు ప్రశ్నించగా.. పోటీ చేయాలన్న ఆలోచనతో రాజీనామా చేయలేదన్నారు. పార్టీలో పోటీ చేసే అర్హత, ఆలోచనలు చాలా మందికి ఉన్నా.. కొంతమంది వ్యక్తులుగా నష్టపోయినా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు.

కాగా.. వాసిరెడ్డి పద్మ 2019, ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. అప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న నన్నపనేని రాజకుమారి రాజీనామా చేయడంతో.. అధికార వైసీపీ వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమిస్తూ జీఓ విడుదల చేసింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టక ముందు ఆమె వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. డిగ్రీ వరకూ చదువుకున్న ఆమె.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తర్వాత 2012లో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి.. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.

Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×