EPAPER

Women’s Day Gift : మహిళలకు మోదీ ఉమెన్స్ డే గిఫ్ట్.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

Women’s Day Gift : మహిళలకు మోదీ ఉమెన్స్ డే గిఫ్ట్.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు


Gay Cylinder Price Down : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్ ధరపై కీలక నిర్ణయం తీసుకుంది. వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 మేర తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని మోదీ అందించిన గిఫ్ట్ ఇది. దీనివల్ల కొన్ని కోట్లమంది ప్రయోజనం పొందుతారు. నిత్యావసర ధరలు క్రమంగా పెరుగుతున్నవేళ వంటగ్యాస్ సిలిండర్ ధరను తగ్గించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నారీశక్తి లబ్దిదారులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది.


Read More : అయోధ్యకు తగ్గని భక్తుల తాకిడి.. 75 లక్షల మందికి రామ్ లల్లా దర్శనం

దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. వంటగ్యాస్ ధరను తగ్గించడంతో ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందని X వేదికగా చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. మహిళలకు సాధికారత కల్పించేందుకు, ఈజ్ ఆఫ్ లివింగ్ ను అందించేందుకు అనుగుణంగా ఉంటుందని మోదీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గతేడాది రక్షాబంధన్ కానుకగా ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.200 తగ్గించిన కేంద్రం.. ఈ ఏడాది మహిళా దినోత్సవం రోజున రూ.100 మేర తగ్గించింది. కాగా.. ఉజ్వల యోజన కింద ఎల్పీజీ సిలిండర్ పై అందిస్తున్న రూ.300 రాయితీని మరో ఆర్థిక సంవత్సరం వరకూ కొనసాగిస్తున్నట్లు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×