EPAPER

India Vs England 5th Test Highlights: స్పిన్నర్లకు చిక్కిన బ్యాటర్లు.. ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆలౌట్

India Vs England 5th Test Highlights: స్పిన్నర్లకు చిక్కిన బ్యాటర్లు.. ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆలౌట్

India Vs England 5th Test


India Vs England 5th Test Live Updates: రాంచీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో తొలిరోజు భారత్ పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  భారత్ స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు విలవిలలాడారు. కులదీప్ యాదవ్ 5 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జాక్ క్రాలీ (79) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. బెన్ డక్కెట్ (27), జో రూట్ (26), జానీ బెయిర్ స్టో (29), బెన్ ఫోక్స్ (24) క్రీజులో నిలదొక్కుకున్న సమయంలో పెవిలియన్ కు చేరారు.


కెప్టెన్ బెన్ స్టోక్స్ డకౌట్ అయ్యాడు. మరో ఇద్దరు బ్యాటర్లు మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్ కూడా సున్నా పరుగులకే అవుట్ అయ్యారు. లంచ్ లోపు 100 పరుగులకే 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. లంచ్ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్లు వెంటనే వెంటనే పెవిలియన్ కు చేరారు.

Read More: యశస్వి జైశ్వాల్ నయా రికార్డ్.. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు

అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ తొలి రోజు ఆటముగిసే సరికి వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ ( 57), రోహిత్ శర్మ  ( 52 బ్యాటింగ్) హాప్ సెంచరీలు చేశారు. తొలి వికెట్ 104 పరుగులు జోడించారు.  ఆ తర్వాత  జైస్వాల్ అవుట్ అయ్యాడు. అతడిని షోయబ్ బషీర్ పెవిలియన్ కు పంపాడు.

జైస్వాల్ అవుటైన తర్వాత రోహిత్ కు శుభ్ మన్ గిల్ (26 బ్యాటింగ్) తోడయ్యాడు. ఈ జోడి మరో వికెట్ పడకుండా తొలిరోజు ఆటముగించింది.  మొత్తంమీద తొలిరోజు భారత్ దే పైచేయిగా ఉంది. భారత్ ఇంకా ఇంగ్లాండ్ కంటే 83 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. రెండోరోజు  బ్యాటర్లు రాణిస్తే ఈ మ్యాచ్ పై టీమిండియా మరింత పట్టు సాధిస్తుంది.

Tags

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×