EPAPER

Beauty Problems : బీకేర్ ఫుల్ అమ్మాయిలు.. లేదంటే మీ ఫేస్..!

Beauty Problems : బీకేర్ ఫుల్ అమ్మాయిలు.. లేదంటే మీ ఫేస్..!

Beauty Problems


Beauty Problems : అందమైన చర్మం కావాలని అమ్మాయిలు ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా సమ్మర్‌లో చర్మాన్ని కాపాడుకోటానకి వేలువేలు ఖర్చుపెట్టి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. చర్మంపై మచ్చలు లేకుండా మృధువుగా ఉండేందుకు అనేక రెమిడీస్ ప్రయాత్నిస్తుంటారు. అయితే చెడు ఆహారపు అలవాట్లు, రుతుక్రమం, హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాల వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటారు.

ఈ చర్మ సమస్యల కారణంగా అమ్మాయిలు అందవిహీనంగా కనిపిస్తారు. దీనివల్ల నలుగురిలోకి వెళ్లడానికి కూడా వెనకాడుతుంటారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే సమ్మర్‌లో మహిళలు ఎటువంటి చర్మ సమస్యలు ఎదుర్కొంటారో తెలుసుకుందాం.


READ MORE : ఒంటరి స్త్రీలలో డిప్రెషన్ ప్రమాదం.. మూడు నెలలు ఇలానే ఉంటే..!

ముడతలు

వయస్సు పెరిగే కొద్దీ.. చర్మం స్థితిస్థాపకత, కొల్లాజెన్‌ను కోల్పోతుంది. దీని వల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి. ఈ రోజుల్లో లైఫ్‌స్టైల్‌ మార్పులు,కాలుష్యం,ఒత్తిడి, చెడు ఆహార అలవాట్ల కారణంగా చర్మంపై ముడతలు వస్తాయి. దీన్ని నివారించడానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి.

డల్‌ స్కిన్‌

చర్మంపై మహిళలు సరైన కేర్ చూపకపోతే ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా చర్మం ఎక్స్‌ఫోలియేషన్‌, స్క్రబ్‌ చేయకపోతే ఈ సమస్య మొదలవుతుంది.

పొడి చర్మం

అమ్మాయిలు చాలా మంది పొడి చర్మం సమస్యను ఎదుర్కొంటారు. పొడి చర్మం వల్ల ముఖం గరుకుగా, బిగుతుగా, నిర్జీవంగా మారతుంది. ఈ సమస్య నివారించడానికి శీరీరం హైడ్రేట్‌గా ఉండాలి. రోజూ వాటర్ మీ శరీరానికి తగినంత తీసుకోవాలి.

హైపర్పిగ్మెంటేషన్

హైపర్పిగ్మెంటేషన్ అంటే చర్మంపై అక్కడక్కడా నల్ల మచ్చలు/ప్యాచుల్లాంటి మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల చర్మ కణాల్లోని మెలనోసైట్స్‌ మెలనిన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మానికి రంగునిస్తుంది. కానీ చర్మంపై అక్కడక్కడా మరీ ఎక్కువగా ఉత్పత్తవడం వల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది.

రోసేసియా

ఈ సమస్య వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ముఖంపై గడ్డలు, దురద రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆహారంలో మసాలా ఎక్కువగా తీసుకోవడం , ఆల్కహాల్ వినియోగం, సూర్యరశ్మి, ఒత్తిడి, హెలికోబాక్టర్ పైలోరీ అనే పేగు బాక్టీరియా వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది.

యాక్నె

అమ్మాయిలు ఎక్కువగా ఎదుర్కొనే చర్మ సమస్య యాక్నె. ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది. దీనికి కాలుష్యం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత,ఆహార అలవాట్లు కారణంగా చెప్పవచ్చు. యాక్నె ముఖంపై, మెడ భాగంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల చర్మానికి దద్దుర్లు, చర్మం ఎరుపెక్కడం, చర్మ రంథ్రాలు మూసుకుపోవడం, బ్లాక్‌హెడ్స్‌, వైట్‌హెడ్స్, గడ్డలు, వంటి సమస్యలు వస్తాయి. ఈ సమయంలో అజాగ్రత్తగా ఉంటే చర్మం నల్లగా మారుతుంది.

READ MORE :  రాత్రిపూట జుట్టుకు నూనె రాస్తున్నారా..?

సన్‌బర్న్‌

ఇది మహిళలు ఎదుర్కొనే మరో సాధారణ సమస్య. దీని కారణంగా సున్నితంగా ఉండే చర్మం కమిలిపోతుంది. UV కిరణాల వల్ల స్కిన్ త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. సన్‌బర్న్‌‌ను ఎదుర్కొడానికి సన్‌స్క్రీన్‌ కచ్చితంగా వాడాలి.

Disclaimer : ఈ సమాచారాన్ని వైద్య నిపుణుల సలహా మేరకు పలు అధ్యయనాల ఆధారంగా అందిస్తున్నాం. దీనిని కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.

Tags

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×