EPAPER

Shabnim Ismail: మహిళా క్రికెట్లో ఫాస్టెస్ట్ బాల్ ఇదే.. రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా బౌలర్..

Shabnim Ismail: మహిళా క్రికెట్లో ఫాస్టెస్ట్ బాల్ ఇదే.. రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా బౌలర్..

Shabnim IsmailShabnim Ismail Bowls Fastest Delivery In Women’s Cricket: ఉమెన్స్ ఐపీఎల్‌లో అరుదైన రికార్డు నమోదయ్యింది. దక్షిణాఫ్రికా మాజీ బౌలర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అత్యంత వేగమంతమైన బాల్ వేసి సరికొత్త రికార్డు సృష్టించింది.


గంటకు 132.1 కిమీ వేగంతో బంతిని సంధించి.. మహిళా క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బాల్ వేసిన బౌలర్‌గా చరిత్ర పుటల్లో నిలిచింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదైంది.

మహిళా క్రికెట్‌లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా పేరున్న ఇస్మాయిల్.. 2016లో వెస్టిండీస్ మీద గంటకు 128 కిమీ వేగంతో బంతిని విసిరింది. 2022లో సెకెండ్ ఫాస్టెస్ట్ బాల్ గంటకు 127 కిమీ వేగంతో రెండు పర్యాయాలు విసిరి రికార్డులన్నీ తన పేరు మీద లిఖించుకుంది. తాజాగా గంటకు 132.1 కిమీ వేగంతో బంతిని విసిరి తన రికార్డును తానే తిరగరాసుకుంది.


ఇప్పటివరకు షబ్నిమ్ ఇస్మాయిల్ దక్షిణాఫ్రికా తరఫున 127 వన్డేలు, 113 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడింది. వన్డేల్లో 191 వికెట్లు, టీ20ల్లో 123 వికెట్లు, టెస్టుల్లో 3 వికెట్లు తీసుకుని మొత్తం మీద 317 అంతర్జాతీయ వికెట్లు తీసుకుంది.

Read More: కారు అద్దం పగులకొట్టేశారు.. రాయల్ ఛాలెంజర్స్ అద్భుత విజయం

గతేడాది షబ్నిమ్ ఇస్మాయిల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పింది. మొత్తంగా దక్షిణాఫ్రికా తరఫున 8 టీ20 వరల్డ్ కప్స్‌లో ఆడింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

Tags

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×