EPAPER

‘Parrot Fever’ Outbreak In Europe: యూరప్ దేశాలలో విజృంభిస్తున్న పారెట్ ఫీవర్

‘Parrot Fever’ Outbreak In Europe: యూరప్ దేశాలలో విజృంభిస్తున్న పారెట్ ఫీవర్

Parrot fever spreading in European countries
 

Parrot fever spreading in European countries: ఏజెన్సీ, బెర్లిన్, ఐరోపాలోని అనేక దేశాలలో పారెట్ ఫీవర్ తీవ్ర  ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పారెట్ ఫీవర్ వ్యాధిని సిటాకోకిస్ అని కూడా అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పారెట్ ఫీవర్ వ్యాధి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది.


గతేడాది ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి .. ఇప్పుడు 2024 ప్రారంభంలోనే అదే ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి సోకి ఐదుగురు మృతి చెందారు. గత ఏడాది ఆస్ట్రేలియాలో 14 పారెట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం మార్చి నాటికి మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నాటికి ఈ అంటువ్యాధికి సంబంధించిన 23 కేసులు డెన్మార్క్ లో నమోదయ్యాయి.. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.

READ MORE: ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం


తాజాగా డెన్మార్క్ లోని ఒక వ్యక్తిలో ఈ వ్యాధి కనిపించింది. ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి. “యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ “తెలిపిన వివరాల ప్రకారం పెంపుడు జంతువులు, అడవి పక్షులతో సంబంధం కలిగిన వారే అధికంగా ఈ వ్యాధి భారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అసలు ఈ పారెట్ ఫీవర్ అనే ఈ వ్యాధి ఎలా వస్తుందంటే క్లామిడియా ఇన్ ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఇది వివిధ రకాల అడవి జంతువులు,పెంపుడు పక్షులు, కోళ్ల ద్వారా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు. కాని అవి శ్వాశ లేదా మలవిసర్జన చేసినప్పుడు బాక్టీరియాను విడుదల చేస్తాయి. ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణం ఇదే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×