EPAPER

Maha Shivratri 2024: మహా శివరాత్రి రోజున ఉపవాసం చేస్తున్నారా..?ఈ నియమాలు తెలుసుకోండి

Maha Shivratri 2024: మహా శివరాత్రి రోజున ఉపవాసం చేస్తున్నారా..?ఈ నియమాలు తెలుసుకోండి

 


Maha Shivratri 2024

Maha Shivratri 2024 Fasting Rules: దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు శివయ్య భక్తులు. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరుపుకునే మహాశివరాత్రి, శివుని పండుగ, వేసవి రాకను సూచిస్తుంది. పరమశివుడి అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. దేశవ్యాప్తంగా హిందువులు జరపుకునే ప్రధాన పండగల్లో ఇది కూడా ఒకటి. మహా శివుడిని త్వరగా ప్రనన్నం చేసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మహా శివరాత్రి పర్వదినాన ఉపవాసం ఎందుకు చేస్తారు? ఉపవాసం ఎలా చేస్తారు? శివరాత్రి రోజు ఉపవాస వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే ఫలితం ఉంటుంది. మహా శివరాత్రి రోజున చేసే ఈ ఉపవాసానికి సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం..


మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాస దీక్షను ఆచరిస్తుంటారు. అయితే ఉపవాసం ఆచరించడంలో మూడురకాల ఉపవాస నియమాలు ఉన్నాయి. ఈ రోజున స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపవాసం ఉంటారు. శివుడి ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. మంచి భర్త కావాలనే కోరికతో పెళ్ళికాని అమ్మాయిలు, అనుకున్న ప్రతి పనిలో విజయం సాధించాలని, కోరిన కోరికలన్ని నెరవేరాలని ఉపవాసం ఉంటారు.

అయితే అందులో ముఖ్యంగా అత్యంత కఠినమైన నిర్జల వ్రతం కూడా ఉంది. ఈ వ్రతం శివరాత్రి ప్రారంభం రోజు నుండి అంటే మార్చి 8వ తేదీ ఉదయం 12 గంటల సమయం నుండి మార్చి 9వ తేదీ సూర్యోదయం సమయం వరకు కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా చేసే వ్రతమే నిర్జల వ్రతం.

ఇక రెండవ వ్రతం పలహార వ్రతం.. ఈ ఉపవాస వ్రతం ఆచరించే భక్తులు పండ్ల రసాలు, పానీయాలు, డ్రై ఫ్రూట్స్ , తృణధాన్యాలు, పాలు వంటివి ఈ ఉపవాస దీక్షలో ఆచరిస్తుంటారు. అయితే మీరు చేసే ఈ ఉపవాసంలో ఉపయోగించే ఏ పదార్ధంలోను ఉప్పు ఉండకాడదు. ఈ పలహార వ్రతం అనేది ఎక్కువగా భక్తులు పండ్లు, పండ్ల రసాలతో ఈ ఉపవాస దీక్షను ఆచరిస్తూ ఉంటారు.

మూడవది సమాప్త వ్రతం.. ఈ రకమైన వ్రతంలో ఎవరైతే ఉపవాస దీక్షను ఆచరించలేరో అలాంటి వారు ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ ఉపవాసంలో పలహార వ్రతంలో పేర్కొన్న అన్నింటిని భోజనంతో పాటు తీసుకోవచ్చు. ఒక సారి మాత్రమే భోజనం చేసి మిగతా సమయం అంతా శివుడికి అంకితం చేసి ఉపవాస దీక్షను ఆచరించాలి.

శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శివుడిని ఆరాధించాలి. ఈ మహా శివరాత్రి రోజున ఉప్పు తీసుకోకూడదు. మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి, మసాలాలతో చేసినవి ఆహారంలో తీసుకోకూడదు. సాత్విక జీవనశైలిని అలవరుచుకోవాలి. మనశ్శాంతి కోసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం, శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం మంచిది. కాబట్టి మహా శివరాత్రి రోజున చాలా మంది భక్తులు ఉపవాస దీక్షను ఆచరిస్తుంటారు.

Tags

Related News

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Shukra Gochar 2024: శుక్రుడి రాశిలో మార్పు.. మొత్తం 12 రాశులపై ప్రభావం

Shani Kendra Trikon Rajyog: ఈ 3 రాశుల వారిపై శని అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారు

Ashwin Month 2024 : అశ్వినీ మాసం ఎంత కాలం ఉంటుంది ? ఉపవాసాలు, పండుగలు జాబితా ఇదే..

Big Stories

×