EPAPER

PM Modi Telangana Tour : ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న ప్రధాని.. NH-161 జాతికి అంకితం

PM Modi Telangana Tour : ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న ప్రధాని.. NH-161 జాతికి అంకితం
pm modi done pooja in ujjaini mahankali temple
pm modi done pooja in ujjaini mahankali temple

PM Modi visit to Hyderabad(Telangana news live): లోక్ సభ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ.. మార్చి 4వ తేదీ నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. తొలిరోజున ఆదిలాబాద్ లో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రామగుండం ఎన్టీపీసీని జాతికి అంకితమిచ్చారు. ఇక రెండోరోజు ఆయన సంగారెడ్డిలో పర్యటించనున్నారు. సోమవారం ఆదిలాబాద్ లో పర్యటన తర్వాత రాజ్ భవన్ కు చేరుకున్న మోదీ.. అక్కడే బస చేశారు.


సంగారెడ్డిలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 7.40 గంటల నుంచి 10.15 గంటల మధ్య రాజ్ భవన్ – బేగంపేట ఎయిర్ పోర్టు మార్గంలో ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ప్రధాని మోడీ పర్యటన సందర్బంగా హైదరాబాద్‌లో హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బెంగళూరులో అనూహ్యంగా జరిగిన బాంబ్ బ్లాస్ట్‌తో.. అంతా ఉలిక్కిపడ్డారు. సిటీలో మరింత అప్రమత్తమవుతున్నారు అధికారులు. రాత్రి రాజ్ భవన్‌లో బస చేసిన ప్రధాని.. ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహంకాళీ అమ్మవారి దర్శనం పూర్తయిన అనంతరం.. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సంగారెడ్డికి వెళ్లి.. అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించారు.


Read More : మెట్రో రెండో దశ.. ఈ నెల 8న శంకుస్థాపన..

సంగారెడ్డి జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 1409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నోషనల్ హైవేను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి మదీనగూడ వరకూ రూ.1298 కోట్లతో NH-65ను ఆరు లైన్లుగా విస్తరించే పనులకు, మెదక్ జిల్లాలో రూ.399 కోట్లతో నిర్మించనున్న NH-765డి విస్తరణ, రూ.500 కోట్లతో చేపట్టనున్న ఎల్లారెడ్డి – రుద్రూర్ విస్తరణ పనులకు మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.  పటేల్ గూడ ఎస్ఆర్ ఇన్ఫినిటీలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని.. ప్రసంగిస్తారు.

 

 

Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×