EPAPER

Apple : యాపిల్ సంస్థకు రూ.16,500 కోట్ల ఫైన్.. ఎందుకంటే!

Apple : యాపిల్ సంస్థకు రూ.16,500 కోట్ల ఫైన్.. ఎందుకంటే!

Apple


Apple : యాపిల్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు మంచి గుర్తింపు ఉంది. టెక్ మార్కెట్‌లో యాపిల్‌కు ఒక సపరేట్ బ్రాండ్ ఉంది. అయితే ఈ కంపెనీకి భారీ షాక్ తగిలింది. యూరోపియన్ యూనియన్ యాప్ స్టోర్‌లో తీసుకుంటున్న చర్యలకు సంబంధించి భారీ జరిమానా విధించింది. తొలిసారిగా యాపిల్ సంస్థ యాంటీట్రస్ట్ పెనాల్టీ ఎదుర్కొంది. యాపిల్ కంపెనీ యాప్ స్టోర్‌లో ఏకపక్ష చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది ఈయూ. ఇందుకు గానూ 1.84 బిలియన్ యూరోలు పెనాల్టీ విధించింది. మన కరెన్సీలో చెప్పాలంటే.. సుమారు రూ.16,500 కోట్లు.

2019లో స్పాటిఫై యాపిల్ సంస్థపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ జరిపి ఫైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. యాపిల్ స్టోర్ వెలుపల ఉన్న ప్రత్యామ్నాయ పేమెంట్ ఆప్షన్స్‌ని తమ యాపిల్ యూజర్లకు తెలియజేయడాన్ని అడ్డుకున్నట్లు గుర్తించింది. ఈ మేరకు జరిమానా విధించింది.


READ MORE : ఫ్లిప్ కార్ట్ మరో ముందడుగు.. యూపీఐ సేవలు ప్రారంభించిన ఈకామర్స్ సంస్థ..

యూరోపియన్ కమిషన్ యాపిల్ సంస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తూ అన్‌ఫేర్ ట్రేడింగ్‌కి పాల్పడుతున్నట్లు గుర్తించింది. యాపిల్ అవలంబింస్తున్న వ్యాపార విధానాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపింది. యాప్ స్టోర్ పరిమితులను ఎత్తివేయాలని యాపిల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా డిజిటల్ మార్కెట్ చట్టాలను అనుసరించాలని పేర్కొంది. యూరోపియన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు మార్చి 7లోపు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ మార్కెట్‌లో యాపిల్ తన ఆధిపత్య స్థానాన్ని దశాబ్దాలుగా దుర్వినియోగం చేయడాన్ని యూఈ టీట్రస్ట్ చీఫ్ మార్గరేట్ వెస్టేజర్ ఖండించినట్లు రాయిటర్స్ ఓ కథనంలో పేర్కొంది.

READ MORE : యూపీఐ లావాదేవీలపై ఫీజు​ వేస్తారా..?

యూరోపియన్ యాంటీట్రస్ట్ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయపరంగా పోరాడతామని యాపిల్ ప్రకటించింది. కోర్టులో ఈ విషయాన్ని సవాలు చేస్తామని తెలిపింది. ఈ నిర్ణయం మార్కెట్ పోటీ స్వభావాన్ని విస్మరిస్తోందని, వినియోగదారులకు హాని కలిగించే ఆధారాలు ఏమీ లేవని యాపిల్ అంటుంది.

ఈ నిర్ణయం వల్ల స్పాటిఫై ప్రయోజనం పొందుతుందని తెలిపింది. ఇతర డెవలపర్లలా కాకుండా స్పాటిఫై దాని వెబ్‌సైట్ ద్వారా నేరుగా సభ్యత్వాలను విక్రయించడం ద్వారా యాపిల్ కమీషన్‌ను అడ్డుకుంటోందని పేర్కొంది.

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×