EPAPER

Supreme Court: జూన్ 15 లోపు పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి.. ఆప్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు..

Supreme Court: జూన్ 15 లోపు పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి.. ఆప్‌ను ఆదేశించిన సుప్రీంకోర్టు..

Supreme Court Judgement on AAP Party OfficeSupreme Court Judgement on AAP Party Office: జిల్లా న్యాయవ్యవస్థను విస్తరించేందుకు ఢిల్లీ హైకోర్టుకు భూమిని కేటాయించామని, జూన్ 15 లోపు ఆమ్ ఆద్మీ పార్టీ రూస్ అవెన్యూలోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 2017 తర్వాత పార్టీకి అక్కడ ఉండే హక్కు లేదని కోర్టు పేర్కొంది.


భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌ను ఆప్ సంప్రదించాలని కోరింది.

రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రాంగణాన్ని ఖాళీ చేయడానికి జూన్ 15, 2024 వరకు సమయం ఇస్తున్నామని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా జిల్లా న్యాయవ్యవస్థను విస్తరించేందుకు కేటాయించిన భూమిని సత్వర ప్రాతిపదికన వినియోగించుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది.


Read More: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం..

 

ఢిల్లీ హైకోర్టు భూముల్లో పార్టీ కార్యాలయం ఎలా ఉంది అని ధర్మాసనం ప్రశ్నించింది. అక్కడ ఉన్న అక్రమ కట్టడాలన్నీ తొలగిస్తామని పేర్కొంది. ప్రజలకు ఉపయోగపడే భూమిని తిరిగి ఢిల్లీ హైకోర్టుకు అప్పగించాలని తెలిపింది.

 

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×