EPAPER

Hyderabad Metro Second Phase : మెట్రో రెండో దశ.. ఈ నెల 8న శంకుస్థాపన..

Hyderabad Metro Second Phase :  మెట్రో రెండో దశ.. ఈ నెల 8న శంకుస్థాపన..

Hyderabad Metro Second Phase


Hyderabad Metro Second Phase(Hyderabad news today): హైదరాబాద్  మెట్రో రెండో దశ పనులకు ముహూర్తం ఖరారైంది. ఎంజీబీఎస్-ఫలక్ నుమా మార్గంలో పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 8న ఈ కార్యక్రమం జరగనుంది.

ఎంజీబీఎస్ నుంచి ఫలకనుమా వరకు 5.5 కిలోమీటర్లు మెట్రో లైన్ నిర్మిస్తారు. ప్రతి కిలోమీటర్ కు ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషేర్ గంజ్ లలో మెట్రో స్టేషన్లు అందుబాటులోకి తీసుకొస్తారు.


మెట్రో రెండో దశలో 70 కిలోమీటర్ల మార్గం నిర్మించాలన్నది అధికారుల ప్రణాళిక. ఇందుకోసం అధికారులు డీపీఆర్ ను రూపొందిస్తున్నారు. మరోవైపు ఎయిర్ పోర్ట్ మార్గంలో భూసార పరీక్షలు నిర్వహించారు. మెట్రో అలైన్ మెంట్ ను ఎంపిక చేశారు. 29 కిలోమీటర్ల ఈ రూట్ లో భూసేరణపై ఫోకస్ పెట్టారు. 3 నెలల్లో పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని అధికారులు అంటున్నారు.

Read More: సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసు.. క్యాన్సర్ బాధితుడి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం..

మెట్రో రెండో దశకు రూ.18,900 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. బ్యాంకులు, జైకా లాంటి సంస్థల నుంచి రుణాలు పొందేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జైకా ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. మెట్రో నిర్మాణ ఒప్పందం ప్రకారం కేంద్రం 35 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. 20 శాతం నిధులు రాష్ట్ర సర్కార్ సమకూర్చనుంది. మిగిలిన మొత్తాన్ని లోన్స్ రూపంలో సేకరిస్తారు.

హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. మూసీని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందుకు నిధుల సేకరణకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు హెచ్‌ఎండీఏ, గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తరణపైనా శ్రద్ధపెట్టారు.

Tags

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×