EPAPER

Diabetes : డయాబెటిస్.. ఈ ఐదు ఫుడ్స్ తింటే ఇక అంతే..!

Diabetes : డయాబెటిస్.. ఈ ఐదు ఫుడ్స్ తింటే ఇక అంతే..!

Diabetes


Diabetic Patients Avoid Foods : డయాబెటిస్‌.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజారోగ్య సమస్య. దీన్ని షుగర్ లేదా చక్కెర వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. మన దేశ జనాభాలో నూటికి 13 మంది షుగర్‌తో బాధపడుతున్నారు. మున్ముందు దీని బారినపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని భారతీయ వైద్య పరిశోధన మండలి హెచ్చరిస్తుంది. షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం ఉంటుంది.

డయాబెటిక్ బాధితులు రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రణలో లేకపోతే.. కంటి, కిడ్నీ సమస్యలు, నాడులు దెబ్బతినడం, పాదాల మీద పుండ్లు పడటం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. షుగర్‌ను కంట్రోల్ చేసేందుకు కొన్ని మందులు తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు, పోషకాహారం తీసుకోవడం ద్వారా కంట్రోల్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.


READ MORE : పొడవాటి గోళ్లు అంటే ఇష్టమా.. షాకింగ్ నిజాలు..!

షుగర్ కంట్రలో ఉండటం చాలా ముఖ్యం. శరీరం ప్యాంక్రియాస్ అనే ఇన్సులిన్ ఉత్పత్తిని నిలిపివేసినప్పుడు లేదా ఉత్పత్తిని తగ్గించినప్పుడు షుగర్ వస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇన్సులిన్ అనేది జీర్ణ గ్రంధి ద్వారా ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

డయాబెటిస్ బాధితులు ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇందుకోసం , ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను షుగర్ పేషెంట్లు తీసుకోవాలి. గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసేకోవడం ద్వారా ఇన్సులిన్‌ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులకు కూరగాయలు ఉత్తమ ఆహారం. అయితే కొన్ని కూరగాయలు షుగర్‌ను పెంచుతాయి. కాబట్టి అన్నిటిని వారు తినకూడదు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఏ కూరగాయలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చి ఉల్లిపాయ

డయాబెటిక్ రోగులు పచ్చి ఉల్లిపాయలను తినకూడదు. ఆహారంలో పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల చక్కెర వేగంగా పెరుగుతుంది. ఆకుపచ్చ ఉల్లిపాయలు అధిక గ్లైసెమిక్‌ను కలిగి ఉంటాయి. ఇది చక్కెరను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తోంది. 100 గ్రాముల ఉల్లి లీవ్స్‌లో 14 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

క్యారెట్లు

డయాబెటిక్ రోగులు ఆహారంలో క్యారెట్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. క్యారెట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. డయాబెటిక్ రోగులు క్యారెట్ జ్యూస్‌ను అసలు తాగకండి.

బంగాళాదుంప

డయాబెటిక్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటే.. బంగాళాదుంపలకు దూరంగా ఉండండి. బంగాళదుంపలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళాదుంపలకు దూరంగా ఉండాలి.

READ MORE : పీచు మిఠాయి బ్యాన్.. అసలు కారణం తెలుసా..!

స్వీట్ పొటాటోస్

చిలగడదుంపలకు కూడా డయాబెటిస్ రోగులు దూరంగా ఉండాలి. చిలకడదుంపల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. షుగర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి స్వీట్ పొటాటోని పక్కనపెట్టండి.

బీట్‌రూట్ జ్యూస్

బీట్‌రూట్‌లో సహజ చక్కెరను కలిగి ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఇది తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బీట్‌రూట్‌ను సలాడ్‌ రూపంలో తీసుకుంటే బెటర్. బీట్‌రూట్ జ్యూస్ తాగడం మానేస్తే ఇంకా మంచిది.

Disclaimer : ఈ సమాచారాన్ని వైద్యనిపుణుల సూచనల మేరకు, పలు అధ్యనాల ఆధారంగా మీ అవగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం. దీనిని కేవలం సమాచారంగా భావించండి.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×