EPAPER

Indian Idol Winner: ఇండియన్ ఐడల్‌ విన్నర్‌గా వైభవ్ గుప్తా, జర్నీపై ఎమోషనల్

Indian Idol Winner: ఇండియన్ ఐడల్‌ విన్నర్‌గా వైభవ్ గుప్తా, జర్నీపై ఎమోషనల్

Vaibhav Gupta gets emotional on his journey as an Indian Idol winner


Vaibhav Gupta gets emotional on his journey as an Indian Idol winner: చాలామందిలో వారికి తెలియని టాలెంట్ వారిలో దాగి ఉంటుంది. కొందరు సింగర్స్‌ అవ్వాలనుకుంటారు, మరికొందరు డ్యాన్సర్‌గానూ, ఇంకొంతమంది వారు ఎంచుకున్న రంగంలో రాణించాలనుకుంటారు. కాకపోతే వారు చేయాల్సిందల్లా ఒక్కటే. వారి టాలెంట్‌ని గుర్తించి కాస్త పదునుపెడితే చాలు. వారనుకున్న రంగంలో అద్భుతంగా రాణించగలరని నిరూపించాడు ఇండియన్ ఐడల్ విన్నర్ వైభవ్ గుప్తా. ఆదివారం ఆరుగురి కంటెస్టెంట్లతో షో నిర్వాహకులు మెగా ఫైనల్ షోని నిర్వహించారు. ఈ ఉత్కంఠగా జరిగిన గ్రాండ్ ఫైనల్‌లో కాన్పూర్‌కి చెందిన వైభవ్ గుప్తా టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు.

Read More:విద్యారంగానికి పెద్దపీట.. 16 వేల కోట్లు కేటాయించిన ఢిల్లీ ప్రభుత్వం..


డ్యాన్స్‌ షోలు, సూపర్‌సింగర్‌, ఇండియన్ ఐడల్‌ వంటి ఫ్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ, చాలామందిలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీసి వారిని ఎంకరేజ్ చేస్తుంటాయి కొన్ని ఛానళ్లు. దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ తమ టాలెంట్‌ని ప్రదర్శిస్తుంటారు. వారు నిర్వాహకుల మన్ననలు పొందితే వారి జీవితాలు బాగుపడుతాయి. ఇక సోనీ టీవీ ఇండియన్ ఐడల్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి 14వ సీజన్ గత ఏడాది అక్టోబర్ 7న స్టార్ట్ అయింది. మొత్తం 15 మందితో ఈ షో మొదలైంది. ఐదునెలలు, 43 ఎపిసోడ్లతో ఆడియెన్స్‌ని అలరించింది.

సోనీ టీవీ ఇండియన్ ఐడల్‌ ప్రోగ్రాంలో ఫైనల్‌ వరకు వైభవ్ గుప్తా, శుభదీప్ దాస్, పీయూష్ పవార్, అనన్యపాల్, అంజనా పద్మనాభన్, ఆధ్యామిశ్రా చేరుకున్నారు. ఫైనల్‌లో వీరి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. చివరకు న్యాయ నిర్ణేతలు ఇచ్చిన రిజల్ట్స్, దేశవ్యాప్తంగా ఆడియెన్స్ వేసిన ఓటింగ్ ఆధారంగా నిర్వాహకులు వైభవ్ గుప్తాను విజేతగా ప్రకటించారు. 14వ సీజన్‌కు సంబంధించి ప్రముఖ సింగర్‌ శ్రేయ ఘోషాల్, గాయకుడు కుమార్ సాను, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ న్యాయ నిర్ణేతలుగా వివరించారు. 1990లో అద్భుతమైన సాంగ్స్ పాడి ఇండియాను ఒక ఊపు ఊపిన కుమార్‌సాను ఈ షోకు నిర్ణేతగా వ్యవహరించడం విశేషం.

Read More: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం..

విజేతగా నిలిచిన వైభవ్ గుప్తాకు సోనీ టీవీ యాజమాన్యం ప్రైజ్ మనీ కింద 25 లక్షలు అందించింది. ఈ సందర్భంగా ఆ డబ్బులు ఏం చేస్తారని విలేఖరులు ప్రశ్నించగా.. ఈ డబ్బుల ద్వారా సొంతంగా ఒక స్టూడియో ఏర్పాటు చేసి, నేను పాడే పాటలను రికార్డు చేస్తానని తెలిపాడు. వాటిని యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తానని, నా టాలెంట్‌కి పెంచుకునేందుకు ఆ స్టూడియో నాకు ఎంతగానో యూజ్ అవుతుందని తెలిపాడు. స్టూడియో ఏర్పాటు చేసుకోవాలనేది ఎప్పటినుంచో నాకున్న ఉన్న కల. ఇప్పుడు సంపాదించిన ప్రైజ్ మనీతో దానిని సాకారం చేసుకోవాలనుకుంటున్నానని ఇండియన్ ఐడల్ విన్నర్ వైభవ్ గుప్తా ప్రకటించాడు.

వైభవ్‌గుప్తా ఇంకా ఎమోషనల్ అవుతూ… తన చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయానని.. తన పెద్దమ్మ సమక్షంలో పెరిగానని.. పాటలే లోకంగా బతికానని తెలిపాడు. తనలో టాలెంట్‌ని ఇంప్రూవ్ చేసుకొని ఏకంగా ఇండియన్ ఐడల్ విన్నర్‌గా నిలివడం ఎంతో ఆనందంగా ఉందని ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ గ్రాండ్‌ ఫైనల్‌లో ఆడియెన్స్‌ అందరూ కూడా పీయూష్, శుభదీప్, అనన్యలో ఎవరో ఒకరు మాత్రమే విన్నర్‌గా నిలుస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా వైభవ్ గుప్తా టైటిల్ దక్కించుకున్నాడు.

 

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×