EPAPER

Pat Cummins : సన్‌రైజర్స్ కు కొత్త కెప్టెన్ .. కమిన్స్ కు బాధ్యతలు..

Pat Cummins : సన్‌రైజర్స్ కు కొత్త కెప్టెన్ .. కమిన్స్ కు బాధ్యతలు..

 


SRH New Captain Pat Cummins

SRH New Captain Pat Cummins : ఐపీఎల్ 2024 సీజన్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇంతకు ముందే ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మని తప్పంచి హార్దిక్ పాండ్యాకు కట్టబెట్టారు. అదెంత సంచలనం అయ్యిందో అందరికీ తెలిసిందే. ముంబై ఫ్రాంచైజీకి తలబొప్పి కూడా కట్టింది. అలాగే గుజరాత్ టైటాన్స్ కు శుభ్ మన్ గిల్ కెప్టెన్ అయ్యాడు. ఇంకా కోల్ కతా నైట్ రైడర్స్ కి శ్రేయాస్ అయ్యర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇలా చూసుకుంటే కెప్టెన్ల మార్పులతో సంచలనాలు నమోదవుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కూడా కొత్త కెప్టెన్ రాబోతున్నాడు.


2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఛాంపియన్‌గా నిలిపిన పాట్ కమిన్స్ ను కెప్టెన్ గా నియమించాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. ఎందుకంటే అప్పటికి లాస్ట్ సీజన్ 2023 లో సన్ రైజర్స్ అట్టడుగు స్థానంలో నిలిచింది. అందువల్ల ఐపీఎల్ వేలంలో రూ. 20.5 కోట్లకు కమిన్స్ ను కొనుగోలు చేసింది. ఎందుకంటే అటూఇటుగా ఉన్న ఆస్ట్రేలియా జట్టును ముందుకు నడిపించి వరల్డ్ కప్ ను సాధించిన కెప్టెన్ గా కమిన్స్ చరిత్రలో నిలిచాడు.

అందుకే సన్ రైజర్స్ కి పూర్వ వైభవం తీసుకొస్తాడని భావించి అతన్ని కొనుగోలు చేసింది. అయితే ఇప్పటి వరకు కెప్టెన్ గా ఉన్న ఐడెన్ మార్క్రమ్ స్థానంలో కమిన్స్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల మార్క్రమ్ సారథ్యంలోని హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టు ఈస్టర్న్ క్యాప్ SA20 లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది.

Read More: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. రోడ్డు ప్రమాదంలో రూ. 3.60 కోట్ల ఆటగాడికి గాయాలు..

ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం సందేహంలో పడిపోయింది. అంత డబ్బు పెట్టి కొన్న కమిన్స్ కి కెప్టెన్ ఇవ్వాలా? జట్టుని గెలిపించి, గాడిలో పెట్టిన మార్క్రమ్ కి ఇవ్వాలా? అని ఆలోచించింది. ఈ విషయంలో ఫ్రాంచైజీ కమిన్స్ కే ఓటు వేసింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్‌ని మార్చి 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×