EPAPER

World Test Championship: న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం.. అగ్రస్థానానికి టీమిండియా..

World Test Championship: న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం.. అగ్రస్థానానికి టీమిండియా..

World Test Championship StandingsWorld Test Championship Standings: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా అగ్రస్థానానికి దూసుకెల్లింది. బేసిన్ రిజర్వ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌‌పై ఆస్ట్రేలియా 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ పరాజయంతో న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానానికి పడిపోయింది. దీంతో టీమిండియా తొలి స్ధానానికి చేరుకుంది.


రాంచీలో జరిగిన నాల్గవ టెస్టులో ఇంగ్లాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తిరుగులేని 3-1 ఆధిక్యాన్ని సాధించిన భారత్, 64.58 పాయింట్ల శాతంతో కివీస్‌ను ప్లేస్‌ను భర్తీ చేసింది.

ఐదు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో, టీమిండియా 8 మ్యాచ్‌లలో 62 పాయింట్లతో ఉంది, అయితే కివీస్ ఐదు మ్యాచ్‌లలో 36 (మూడు విజయాలు, రెండు ఓటములు) పాయింట్లతో, 60.00 పాయింట్‌ శాతంతో రెండో స్థానానికి పడిపోయింది.


వెల్లింగ్టన్ టెస్ట్ ప్రారంభానికి ముందు, న్యూజిలాండ్ నాలుగు గేమ్‌లలో 36 పాయింట్లతో, 75 పాయింట్ల శాతంతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

కానీ 172 పరుగుల ఓటమి తరువాత, 2021 WTC ఛాంపియన్లు అగ్రస్థానాన్ని కోల్పోయారు, 60 పాయింట్ల శాతంతో నంబర్ 2 స్థానానికి పడిపోయారు.

Read More: అగార్కర్ కోపగించుకున్నాడా? అందుకు శ్రేయాస్ బలయ్యాడా?

మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా వెల్లింగ్‌టన్ టెస్ట్ తర్వాత 12 కీలక పాయింట్లు సాధించి, 11 మ్యాచ్‌లలో (ఏడు విజయాలు, మూడు ఓటములు, ఒక డ్రా) 78 పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా పాయింట్ల శాతం కూడా 55 నుంచి 59.09కి పెరిగింది.

మార్చి 8 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే చివరి టెస్టులో ఆస్ట్రేలియా గెలిస్తే 2023 ఛాంపియన్ న్యూజిలాండ్‌ను అధిగమించి రెండవ స్థానానికి ఎగబాకడానికి అవకాశం ఉంది.

మరోవైపు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుటుంది.

ఒకవేళ.. ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్‌పై విజయం సాధిస్తే ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. 

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×