EPAPER

Allu Arjun : కేర‌ళ‌లో అమ్మాయికి అండ‌గా అల్లు అర్జున్‌.. అప్రిషియేట్ చేస్తున్న నెటిజ‌న్స్‌

Allu Arjun : కేర‌ళ‌లో అమ్మాయికి అండ‌గా అల్లు అర్జున్‌.. అప్రిషియేట్ చేస్తున్న నెటిజ‌న్స్‌

Allu Arjun : సిల్వ‌ర్ స్క్రీన్‌పైనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ తాను రియ‌ల్ అని మ‌ళ్లీ ప్రూవ్ చేసుకున్నారు అల్లు అర్జున్‌. ఓ ముస్లిం అమ్మాయికి ఉన్న‌త చ‌దువుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌టానికి ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక్క‌డ చెప్పాల్సిన విష‌య‌మేమంటే బ‌న్నీ ఉన్న‌త చ‌దువుల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్న అమ్మాయి కేర‌ళ రాష్ట్రంలో ఉండ‌టం. వివ‌రాల్లోకి వెళితే కేర‌ళ అల‌ప్పం జిల్లాలో ముస్లిం సామాజికి వ‌ర్గానికి చెందిన అమ్మాయి ప్ల‌స్ టు ఎగ్జామ్స్‌లో 92 శాతం మార్కుల‌తో పాసైంది. ఆమె న‌ర్స్ కావాల‌నుకుంది. ట‌ఫ్ కాంపీటీష‌న్‌లో సీట్ ద‌క్క‌లేదు.


దీంతో జిల్లా క‌లెక్ట‌ర్ చొర‌వ‌తో ఓ ప్రైవేటు కాలేజీలో సీటు వ‌చ్చింది. కానీ ప్రైవేటు కాలేజీలో చ‌దువు, హాస్టలు వ‌స‌తి వంటి వాటికి ఎక్కువ మొత్తంలో డ‌బ్బులు చెల్లించాల్సి ఉంది. దీంతో ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియ‌లేదు. చివ‌ర‌కు క‌లెక్ట‌ర్ పూనుకుని అల్లు అర్జున్‌ని సంప్ర‌దించారు. ఓ ఏడాది పాటు అమ్మాయి చ‌దువు, హాస్ట‌ల్ ఫీజులు చెల్లిస్తే బావుంటుంద‌ని రిక్వెస్ట్ చేశారు. అయితే బ‌న్నీ ఏకంగా ఆ అమ్మాయి నాలుగేళ్ల ఫీజు, హాస్ట‌ల్ ఖ‌ర్చులు చెల్లించ‌టానికి ముందుకు వ‌చ్చారు. అల్లు అర్జున్ మంచి మ‌న‌సుకు క‌లెక్ట‌ర్ ఫేస్ బుక్ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం స‌ద‌రు పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.


Tags

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×