EPAPER

Paracetamol Side Effects : పారాసిటమాల్‌ టాబ్లెట్ ఎక్కువగా వాడుతున్నారా..!

Paracetamol Side Effects : పారాసిటమాల్‌ టాబ్లెట్ ఎక్కువగా వాడుతున్నారా..!

Paracetamol


Paracetamol Side Effects : మనలో చాలా మంది కాస్త జ్వరమైనా, తలనొప్పి వచ్చినా వెంటనే మెడికల్ షాపుకు పరుగెత్తి తెచ్చుకునే టాబ్లెట్ పారాసిటమాల్. జ్వరం వచ్చినప్పుడే కాదు.. తలనొప్పి , జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య లక్షణాలు కనపించినా ఈ టాబ్లెట్ వేసుకోమని కొందరు సలహాలు ఇస్తుంటారు. ఈ టాబ్లెట్‌లు దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. పారాసిటమాల్ వేసుకున్న వెంటనే సమస్య తీరిపోతుంది.

అయితే పారాసిటమాల్ టాబ్లెట్ అధికంగా వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ సూచించిన డోస్ కంటే ఎక్కువ మోతాదులో వాడకూడదని చెబుతున్నారు. ఈ టాబ్లెట్ తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు, కడుపునొప్పి, పిరియడ్ క్రాంప్స్ వంటి రకరకాల అనారోగ్య సమస్యలకు వాడుతున్నారు.


పారాసిటమల్ టాబ్లెట్‌పై ఎడిన్‌బరో యూనివర్సిటీ ఓ అధ్యయనం నిర్వహించిందింది. ఎలుకలపై ఈ టాబ్లెట్‌ను పరిశీలించారు. ట్యాబ్లెట్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలను గుర్తించారు. పారాసిటమాల్ వల్ల కాలేయం దెబ్బతింటినట్లు అధ్యయనంలో తేలింది.

Read More : మీ మూడ్ అస్సలు బాగోలేదా.. ఇలా సెట్ చేయండి!

పారాసిటమల్ శరీర అవయవాల్లోని కీలకమైన నిర్మాణాన్ని పాడుచేస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాలేయం, ఇతర అవయవాలకు మధ్యనున్న కణజాలాన్ని పారాసిటమాల్ దెబ్బతీస్తున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా పారాసిటమాల్ ఎక్కువగా వాడటం వల్ల కాలేయం దెబ్బతింటుంది.

పారాసిటమాల్ కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావొచ్చు. అధిక మోతాదులో తీసుకోవడం లేదా ఉప్పునీటితో పారాసిటమాల్ తీసుకోవడం వల్ల మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్యులు అంటున్నారు. పారాసిటమాల్ ఎంత మోతాదులో తీసుకుంటే ప్రభావవంతంగా పనిచేస్తుందనే దానిపై ఆరోగ్య నిపుణులు పలు సలహాలు ఇస్తున్నారు.

పారాసిటమాల్ పెద్దలకైతే ఒక మోతాదుకు 1 గ్రాము తీసుకోవాలి. అలా ఒక రోజులో 4 గ్రాములకు మించి తీసుకోకూడదు. ఒకవేళ వారికి ప్రతిరోజూ మద్యం సేవించే అలవాటు ఉండుంటే రోజులో 2 గ్రాములకు మించి తీసుకోవద్దు. పిల్లలకు వేసేటపుడు డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం .

పారాసిటమాల్‌ను ఎక్కువగా వాడే రోగుల్లోనూ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు కనుగొన్నారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారు రోజుకు 4 గ్రాములు మించి ఈ టాబ్లెట్ తీసుకోకూడదు. అంతకుమించి తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Read More : జిమ్ చేసేప్పుడు ఆ లక్షణాలు.. హార్ట్ ఎటాక్ కారణం కావొచ్చు..!

పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్న 2-3 గంటల్లోపే మళ్లీ మాత్రలు వేసుకోవడం చాలా ప్రమాదకరం. టాబ్లెట్ వేసిన కొద్ది నిమిషాల్లోనే రిలీఫ్ పొందాలనుకోవడం కాని పని అని గుర్తించాలి. ఏ టాబ్లెట్ అయినా శరీరంపై ప్రభావం చూపాలంటే కొంత సమయం పడుతుంది.

పారాసిటమాల్ టాబ్లెట్లలో స్టెరాయిడ్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. 3 రోజులకు మంచి ఈ టాబ్లెట్ వాడొద్దు. లివర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా పారాసిటమాల్ ఉపయోగించొద్దు.

Disclaimer : ఈ కథనాన్ని వివిధ అధ్యయనాలు, పలు మెడికల్ జర్నల్స్ ప్రకారం అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×