EPAPER

CM Revanth Reddy: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఆ స్కీమ్ తేనున్న రేవంత్ సర్కార్..

CM Revanth Reddy: అన్నదాతలకు గుడ్ న్యూస్..  ఆ స్కీమ్ తేనున్న రేవంత్ సర్కార్..

CM Revanth Reddy news


CM Revanth Reddy news(Today news in telangana): ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైఫరిత్యాలు, ఊహించని సంఘటనల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో 2016జూన్ నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అయితే ఈ పథకంలో భాగంగా రైతులకు స్వల్ప మొత్తంలో పంటల ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. కానీ ఈ పథకం వల్ల అన్నదాతలకు మేలు కంటే భారమే ఎక్కువ అంటూ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్కీమ్ నుంచి 2020లో వైదొలిగింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పంఠ భీమా పథకం అమలు కావడం లేదు. దీంతో ప్రకృతి వైఫరిత్యాల కారణంగా పంట నష్టం జరిగినా రైతులకు ఎలాంటి పరిహారం అందని పరిస్థతి రాష్ట్రంలో నెలకొంది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినా కేసీఆర్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

రైతు బందు, రైతు భీమా పథకాలను చూపిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ ప్రచారం చేసుకుందనే విమర్శలు లేకపోలేదు. కాగా ఫసల్ భీమా యోజన నుంచి వైదిలిగాక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సొంతంగా ఓస్కీమ్ తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనలోకొన్ని మార్పులు చేసి బంగ్లా సస్య భీమా యోజన పేరుతో రైతులకు భీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ విధంగానే గతంలో బీమా పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసినా ఆచరణలోకి తేలేదు.


అయితే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ ను ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అయితే తాజాగా రేవంత్ సర్కార్ కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన స్కీమ్ లో చేరుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ స్కీమ్ కింద ఒక్క రైతు బీమా చేయించుకున్న మొత్తంలో కొంత శాతం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వాణిజ్య పంటల కోసం బీమా మొత్తంలో 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

Read More: త్వరలో రైతు, విద్యా కమీషన్లు ఏర్పాటు.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..

అయితే రబీ సీజన్ లో ఆహార ధాన్యాలను 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రారంభంలో రైతులు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు తీసుకునేటప్పుడు ఈ పథకంలోచేరాలని కచ్చితమైన నిబంధనలు నియమించారు. తర్వాత దీనిని ఆప్షనల్ గా మారుస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ స్కీమ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ బెంగాల్ ప్రభుత్వం తరహాలో ఏదైనా మార్పలు చేస్తుందా..? లేక కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ నే యధావిధిగా అమలు చేస్తుందా..? అని వేచిచూడాల్సిందే.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×