EPAPER

Internet Users in India : దేశంలో ఇంటర్నెట్ వాడనోళ్లు ఇంతమంది ఉన్నారా!

Internet Users in India : దేశంలో ఇంటర్నెట్ వాడనోళ్లు ఇంతమంది ఉన్నారా!

Internet


Internet Users in India : దేశంలో ఇంటర్నెట్ యూజర్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన పది సంవత్సరాలతో పోలిస్తే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో మొదట 2జీ నెట్‌వర్క్ ఉండేది. తర్వాత అది 3జీ అయింది. జియో రాకతో 4జీ వేగం గణనీయంగా పుంజుకుంది. ఇప్పుడు 5జీ సేవలు కూడా అందుబాటులొకి వచ్చాయి. ఈ ఏడాది కోట్లాది మంది టెలికాం వినియోగదారులు 4జీ నుంచి 5జీకి మారారు.

ఎందుకంటే వినియోగదారులు ఇప్పుడు 5జీతో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే 5జీ యుగంలో కూడా చాలా మంది ఇంటర్నెట్‌ను ఉపయోగింయడం లేదట. సగం మంది భారతీయులు ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్నారట. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..


Read More :  ఓరి దేవుడా!.. 28,000 mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ఇంత తక్కువ ధర

ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. దేశంలో 45 శాతం జనాభాకు ఇంటర్నెట్ అందుబాటులో లేదు. దీనికి సంబంధించిన లెక్కలు చూస్తే.. 2023 నాటికి దేశంలో నివిసిస్తున్న జనాభాలో66.5 కోట్ల మందికి ఇంటర్నెట్ వాడటం లేదు.

ఇప్పుడు ఈ సంఖ్య సంఖ్య 45 శాతానికి చేరుకుంది. దేశంలోని 66.50 కోట్ల మంది యాక్టివ్‌గా లేని ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. కానీ గత మూడేళ్ల లెక్కలను చూస్తుంటే ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతోంది. యాక్టివ్‌గా లేని యూజర్ల సంఖ్య సంవత్సరానికి మూడు నుంచి నాలుగు శాతం తగ్గుతోంది.

Read More : ఎండ చంపేస్తుందా?.. 5జీ ఫోన్ రేటుకే ఏసీని కొనేయండి.. ఈ ఆఫర్ మీకోసమే.

ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. దేశంలోని గ్రామాలలో నివసిస్తున్న దాదాపు సగం మంది ప్రజలు ఇంటర్నెట్‌ సేవలకు దూరంగా ఉన్నారు. ఇంటర్నెట్‌‌కు దూరంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

  • ఇంటర్నెట్ వాడని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్నెట్ అర్థం చేసుకోవడం చాలా కష్టమని భావిస్తున్నారు.
  • వారిలో 22 శాతం మందికి ఇంటర్నెట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియదు.
  • ఇంటర్నెట్ వాడని వారిలో 22 శాతం మందికి ఇంటర్నెట్‌ని ఉపయోగించడంపై ఆసక్తి లేదు.
  • ఇంటర్నెట్ యూజర్లలో 21 శాతం మందికి ఇంటర్నెట్ ఉపయోగించడానికి పర్మిషన్ లేదు.
  • దేశంలో 17 శాతం మంది ప్రజలకు ఇంటర్నెట్ కొనుగోలు చేసే శక్తి లేదు.
  • 16 శాతం మంది ప్రజలు ఇంటర్నెట్ వాడటం చాలా గందరగోళంగా ఉంది.
  • కొందరికి మొబైల్ లేదా కంప్యూటర్ వంటి సొంత డివైస్ లేదు.
  • దేశ జనాభాలో 13 శాతం ప్రజలకు ఇంటర్నెర్ అవసరం లేదు

దేశంలోని యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిరోజూ కొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. 2023 నాటికి దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 800 మిలియన్లు అంటే 80 కోట్లు దాటింది. ఈ నివేదిక ప్రకారం 2023 నాటికి భారతదేశంలో 820 మిలియన్లు అంటే దాదాపు 82 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకుంటున్నారు.

Tags

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×