EPAPER

CM Jagan: పేద పిల్లల కోసమే విద్యా దీవెన.. పామర్రులో సీఎం జగన్..

CM Jagan: పేద పిల్లల కోసమే విద్యా దీవెన.. పామర్రులో సీఎం జగన్..

CM Jagan public meeting update


CM Jagan public meeting update(Election news in ap today): చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని అందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్లతో జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా దీవెన కార్యక్రమం ప్రకారం ఉన్నత చదువులు చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును తల్లుల అకౌంట్లో ప్రభుత్వం వేస్తోందన్నారు. ఆ తర్వాత తల్లులే స్వయంగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తారని సీఎం తెలిపారు.

రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మంది పిల్లలు 9,44,666 మంది పిల్లలకు తమ ప్రభుత్వం ఫీజులు కడుతుందని జగన్ అన్నారు. ఏ పేద వాడు కూడా చదువు కోసం అప్పుల పాలు కాకూడదని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీలతో పాటు మిగిలిన కులాల వారిని స్కీమ్ కు అర్హులుగా చేసేందుకు ఆదాయపరిమితిని లక్షల దాకా పెంచామన్నారు. దీంతో లబ్దిదారుల సంఖ్య పెరిగి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వరా మంచి చేయగలుగుతున్నమన్నారు.


తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద చదువుల వరకు విద్యా రంగంలో పెద్ద మార్పులు తీసుకువచ్చాని జగన్ అన్నారు. విద్యారంగంలో 57 నెలల కాలంలో పథకాల మీద రూ.73 వేల కోట్లు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. పేదరికం నుంచి బయటికి రావడానికి చదువు ఒక్కటే అస్త్రమని నమ్మి మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతున్నామన్నారు.

Read More: ఏపీ ఎలక్షన్‌లో గ్లామర్‌ డోస్‌, సమంత ఎంట్రీ

ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలని ఆరాట పడితే చంద్రబాబు, రామోజీరావు, పవన్ కళ్యణ్ తో యుద్దం చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. వీళ్లెవ్వరి పిల్లలు తెలుగు మీడియంలో చదవడం లేదన్నారు. ప్రభుత్వ బడుల్లో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడితే మాత్రం నానా యాగీ చేసి మన మీద యుద్దమే చేస్తున్నారన్నారు.

ప్రపంచ స్థాయిలో టాప్ 50ర్యాంకుల్లో ఉన్న330 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే పిల్లలు రూ. కోటి 25లక్షల దాకా ఫీజు కడుతున్నామని జగన్అన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలోనే కరిక్యులమ్ లో మార్పలు తీసుకువచ్చి జాబ్ ఓరియెంటెడ్ గా మార్చామన్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×