EPAPER

How Many Steps A Day : రోజుకు ఎన్ని అడుగులు వేస్తే మంచిది.. సైన్స్ ఏం చెబుతుంది..!

How Many Steps A Day : రోజుకు ఎన్ని అడుగులు వేస్తే మంచిది.. సైన్స్ ఏం చెబుతుంది..!

walking


How Many Steps A Day : నడక అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. జీవితంలో నడక అనేది లేకపోతే పలు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతాయి. వైద్యులు.. నడక నాలుగు విధాల మేలు చేస్తుందని చెబుతుంటారు. అయితే మంచి ఆరోగ్యం కోసం ఎంత దూరం నడవాలనే అంశంపై కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో 30 నిమిషాలు పాటు శారీరక శ్రమ చేయాలని నిర్ధారించారు.

అలానే 60ఏళ్లు పైబడినవారు రోజూ నడవటం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఇటీవలే ఇదే అంశాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మాసాచుసెట్స్‌ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. రోజులో 60 ఏళ్లు పైబడిన వారు 6వేల నుంచి 9వేల అడుగులు నడిస్తే గుండె ఆరోగ్యానికి మంచిదని తేలింది.


Read More : సమ్మర్.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విటమిన్లు తీసుకోండి!

ఈ పరిశోధనల్లో భాగంగా అమెరికాతో సహా 42 దేశాల్లోని 18 ఏళ్లు పైబడిన 20 వేల మంది ప్రజల సమాచారాన్ని సేకరించారు. ఆరేళ్లుగా వారు నడుస్తున్న దూరం, కార్డియోవాస్కులర్‌ డిసీజ్‌, నాన్‌ ఫాటల్‌ కరోనరీ హార్ట్‌ డిసీజ్, స్ట్రోక్, హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి అంశాలను సేకరించారు. రోజుకు 6వేల అడుగులు నడిస్తే గుండెపోటు ప్రమాదం తక్కువగా ఉంటుందని ఈ అధ్యనంలో వెల్లడైంది.

రోజుకు 6 వేల అడుగులపైన నడిచే వారిలో గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు 40 నుంచి 50 శాతం వరకు తగ్గుతుందని గుర్తించారు. అంతేకాకుండా రోజుకు 2 వేల అడుగుల మాత్రమే నడిచే వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు.

అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం.. మన దేశంలో 43.3 శాతం మంది ప్రజలు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. వాకింగ్, జాగింగ్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయని వెల్లడించింది. 70 మంది ప్రజలు శారీరక శ్రమ చేయకపోవడం వలనే అనారోగ్యం బారిన పడుతున్నారని హెచ్చరించింది.

నడకకు వయసుతో సంబంధం లేదు. రోజు నడిచే వారికి నడక చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. నడకను అందరూ అలవాటు చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ తగ్గిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు శ్రమకు దూరంగా ఉంటున్నారు. దీనికితోడు ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్ ఇష్టానుసారంగా తినడం వల్ల ఊబకాయంతో బాధపడేతున్నారు.

నడక అనేది సహజమైన వ్యాయామం. రోజుకు 30 నిమిషాలు నడవటం వల్ల ఊబకాయం, రక్తపోటు, ఇతర అనారోగ్య సమస్యలను అదుపు చేయొచ్చు. ప్రతి ఒక్కరు నడకను జీవితంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు.

Read More : హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. వణికిస్తున్న స్కార్లెట్ ఫీవర్.. మీ పిల్లలు జాగ్రత్త

డయాబెటిస్‌ను అదుపు చేయడంలో నడక సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలో తరచూ తగ్గుతూ, పెరుగుతూ ఉంటే నడకతో ఆ సమస్యను పరిష్కిరించొచ్చు.

రోజూ నడవడం వల్ల రక్తప్రసరణ పెరిగి.. రక్తం శుభ్రంగా ఉంటుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఆందోళన, ఒత్తిడిలు తగ్గుతాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రోజంగా యాక్టివ్‌గా, ధృడంగా ఉంటారు.

Disclaimer : ఈ సమాచారాన్ని మీ అవగాహన కోసం పలు అధ్యాయనాల ఆధారంగా రూపొందించాం. దీనిని సమాచారంగా మాత్రమే భావించండి

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×