EPAPER

Property tax: హైదరాబాదీలకు శుభవార్త.. ప్రాపర్టీ ట్యాక్స్ పై భారీ డిస్కౌంట్..

Property tax: హైదరాబాదీలకు శుభవార్త.. ప్రాపర్టీ ట్యాక్స్ పై భారీ డిస్కౌంట్..

Property tax telangana


Property tax telangana(Hyderabad latest news): హైదరాబాద్ లో ప్రావర్టీ ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై విధించే వడ్డీపై 90శాతం మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిమితుల్లోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు అలాగే వన్ టైమ్ స్కీమ్ కింద ఇతర యూఎల్బీలకు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ ప్రయోజనాన్ని పొందేందుకు, పన్ను చెల్లింపుదారులు 2022-2023 ఆర్తిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిల ప్రధాన మొత్తాన్ని తప్పని సరిగ్గా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పేరుకుపోయిన బకాయిలపై వడ్డీపై 90 శాతం రాయితీపోగా మిగిలిన 10 శాతం వడ్డీని ఒకే సారి చెల్లించాలి. అయితే ఈ పథకం అమలుకు ముందు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 2023 వరకు వడ్డీ, పెనాల్టీలతో సహా మొత్తం ఆస్తి పన్ను బకాయిలను ఇప్పటికే సెటిల్ చేసిన పన్ను చెల్లింపుదారులకు కూడా పథకం ప్రయోజనాలు అందనున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని లేదా తిరిగి అంచనా వేసిన పన్నులపై వడ్డీని 90 శాతం మినహాయిస్తూ వన్-టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1,000 చదరపు అడుగుల లోపు స్వీయ-ఆక్రమిత నాన్ ఆర్సీసీ నివాస ఆస్తుల ఎగవేసిన పన్నులో 25శాతం మాత్రమే పెనాల్టీగా చెల్లించవచ్చు. విచారణ జరిపి డిఫాల్టర్లను గుర్తించేందుకు ఐఏఎస్ అధికారులను బీబీఎంపీ రెవెన్యూ కమీషనర్లుగా నియమించారు.

Read More: అరుదైన గౌరవం.. ఆ జాబితాలో జగన్ కంటే సీఎం రేవంతే పవర్ ఫుల్..

తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు కూడా వసూలు చేసేందుకు రాయితీ ప్రకటించింన సంగతి అందరికీ తెలిసిందే. టూ వీలర్స్, త్రీవీలర్స్ పై 80 శాతం రాయితీ విధించింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులపై 90శాతం రాయితీని ప్రకటించింది. దీని ప్రభుత్వానికి రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

 

Related News

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

TPCC: కొత్త బాస్ ముందున్న.. అతిపెద్ద సవాల్

Big Stories

×